Thursday, 28 June 2018

ఏప్రిల్ 2018 సైన్స్ & టెక్నాలజీ

జీవ గ్రహాల అన్వేషణకు వ్యోమనౌక 
సౌరకుటుంబం వెలుపల గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 19న వ్యోమనౌకను ప్రయోగించారు.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతంభారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ (రీప్లేస్‌మెంట్) బరువు 1,425 కిలోలు. ఇందులో ఎల్5, ఎస్‌బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియరం పరమాణు గడియారాలు, సీబ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రెఫ్లెక్టర్లున్నాయి. దీని పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి. 
ప్రయోగం జరిగిందిలా..
321 టన్నుల బరువు, 44.4 మీటర్ల పొడవున్న సీ41 రాకెట్ ప్రయోగంను మొత్తం నాలుగు దశల్లో ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సహాయంతో చేపట్టారు. మొదటిదశలో స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సహాయంతో 110 సెకన్లలో మొదటి దశను పూర్తిచేశారు. ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 263 సెకండ్లకు రెండో దశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 598 సెకండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1122 సెకండ్లకు నాలుగోదశ పూర్తయింది. ఈ ఉపగ్రహాన్ని పెరీజీ (భూమిగా దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 20,650 కిలోమీటర్ల ఎత్తులో భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను 2013 జులై 1న కక్ష్యలోకి పంపారు. ఇందులో సమయాన్ని నిర్ధరించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో 2017 ఆగస్టు 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహంను ప్రయోగించారు. ఉష్ణకవచాలు తెరుచుకోకపోవడంతో ప్రయోగం చివరి దశలో ఇది కూడా విఫలమైంది. దీంతో తాజాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఐను ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో కొన్ని ఉపగ్రహాలు భూస్థిర కక్ష్య (జీఈవో) లో మరికొన్ని భూఅనువర్తిత కక్ష్య (జీఎస్‌వో)లో పరిభ్రమిస్తాయి.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపయోగాలు
  • నింగి, నేల, నీటిలో కూడా నావిగేషన్ సేవలు అందిస్తుంది.
  • సైనికులకు ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని చూపిస్తుంది.
  • మత్స్యకారులు, విపత్తు నిర్వహణ సేవలను అందిస్తుంది.
  • వాహనాల గమనం, మొబైల్ ఫోన్లతో వాహనాల అనుసంధానం
  • మ్యాపింగ్ వంటి తదితర సేవలు కూడా పొందవచ్చు.
నావిక్ లేదా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?
అమెరికా ప్రవేశపెట్టిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) తరహాలో భారత్‌కు సొంత దిక్సూచి (నావిగేషన్) వ్యవస్థ ఉండాలని ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని వల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల మేర నిర్ధిష్ట సమయం, పొజిషన్, నావిగేషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2,246 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి గ్లోబల్ ఇండియన్ నావిగేషనల్ సిస్టమ్ (జీఐఎన్‌ఎస్)ను ఇస్రో చేపట్టనుంది. 
దేశాలు - దిక్సూచీ వ్యవస్థలు
దేశాలు
దిక్సూచీ వ్యవస్థలు
అమెరికా
జీపీఎస్
రష్యా
గ్లోనాస్
యూరప్
గెలీలియో
భారత్
నావిక్

సూర్యుడి వద్దకు తెలంగాణ విద్యార్థుల పేర్లు
 
సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా సూర్యుడి వద్దకు తమ పేర్లను పంపే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిన్నారం మండలం బొల్లారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఫణిధర్, నరేశ్, ఉదయ్, గౌతమి, అనితలకు ఈ అవకాశం దక్కింది.
సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి సూర్యుడికి అతిదగ్గరగా అధ్యయనం చేసేందుకు నాసా మే నెలలో ‘పార్కర్ పోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్’ అనే యంత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ యంత్రంలో ఉండే మెమొరీ కార్డులో పేర్లను నిక్షిప్తం చేసి పంపడానికి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరింది. ఇందుకోసం దరఖాస్తు చేసిన తమ పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్‌రెడ్డి తెలిపారు.


భూస్థిర కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ
నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని భూ స్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు నాలుగు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న రోదసిలోకి పంపారు.


హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్ ప్రారంభం
భారతదేశ తొలి హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 10న బిహార్‌లోని మోతిహరీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్‌స్టోమ్ సంయుక్తంగా 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం గల రైలు ఇంజన్‌ను తయారుచేశాయి. వచ్చే 11 ఏళ్లలో మరో 800 రైలు ఇంజన్లను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

సైబర్ నేరాలకు కొత్త అస్త్రం క్రిప్టోజాకింగ్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు కొత్త పద్ధతులు వినియోగిస్తున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్ తెలిపింది. సంప్రదాయ సైబర్ నేరాలతో సంపాదన తగ్గిపోతుండటంతో కొత్త పద్ధతుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ (ఐఎస్‌టీఆర్) పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ విధానంలో క్రిప్టోకరెన్సీ (బిట్‌కాయిన్) లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైందని తెలిపింది.


క్రిప్టోజాకింగ్ అంటే?
మొబైల్, పీసీ, ట్యాబ్లెట్ లేదా ఇంటర్నెట్ ఆధారిత(ఐఓటీ) పరికరాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేయడాన్ని క్రిప్టోజాకింగ్ అంటారు. ఫలితంగా కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు నెట్‌వర్క్ మొత్తం సమస్యలకు గురవుతుంది. దీనిని వాడుకొని హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని పొందుతారు.


జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతంభారత సమాచార వ్యవస్థకు మరింత సాంకేతికతను జోడించేందుకు మార్చి 29న ప్రయోగించిన జీశాట్6-ఏ విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 వాహకనౌక, 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ (పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు) ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని ఇస్రో నమోదు చేసింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం.

ప్రయోగం జరిగిందిలా..49.1 మీటర్ల పొడవు, 415.6 టన్నులున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 మొదటి దశలో 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ ఉన్నాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో 138.11 ఘన ఇంధనంతో 151 సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 285 సెకన్లలో రెండోదశను, ఆ తరువాత మూడో దశ (క్రయోజనిక్ దశ) ను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేసింది. మొత్తం 25 నిమిషాల పాటు ప్రయాణించి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్య అయిన పెరిజీ 170 కిలోమీటర్లు, సుదూర కక్ష్య అయిన అపోజీ 35,975 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెట్టింది. అనంతరం హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకున్నారు.

జీశాట్ 6ఏ ప్రయోజనాలుజీశాట్-6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్ బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్‌డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. సాధారణంగా ఇస్రో రూపొందించే ఆంటెన్నా కంటే ఇది మూడు రెట్లు పెద్దది.

ఎస్ బ్యాండ్ అంటేఎస్ బ్యాండ్ అనేది విద్యుదయాస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం. 2 నుంచి 4 గిగా హెర్ట్జ్ పౌనపున్యాల మధ్య నడిచే ఈ బ్యాండ్ వాతావరణానికి సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో వాడుతున్నారు. 2.5 జీహెచ్‌జెడ్‌ను ప్రపంచవ్యాప్తంగా 4జీ సేవలకు వినియోగిస్తున్నారు.


జీశాట్-6ఏ కక్ష్య దూరం పెంపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 ద్వారా మార్చి 29 న ప్రయోగించిన జీశాట్ 6ఏ ఉపగ్రహ మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పొడిగించారు. ఈ రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపడుతున్నారు.


భూమిపై కూలిపోనున్న చైనా అంతరిక్ష కేంద్రం
చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం నిరుపయోగంగా మారి, నియంత్రణ కోల్పోవడంతో త్వరలోనే భూమిపై కూలిపోనుంది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఏప్రిల్ 2న ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
టియాంగంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్-1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్‌‌డ స్పేస్ ఏజెన్సీ చెప్పింది.


'జీశాట్-6ఏ’ తో తెగిపోయిన సంబంధాలుదేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
మార్చి 30, 31 తేదీల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. ఏప్రిల్ 2న మూడో విడత కక్ష్య దూరం పెంపులో భాగంగా ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి. 


పసిఫిక్ మహాసముద్రంలో కూలిన టియాంగంగ్
చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్-1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఏప్రిల్ 1న ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్-1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎవ్వరికీ హాని జరగలేదనీ, నియంత్రణ కోల్పోయిన స్కైలాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్‌‌డ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. 
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్-1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ దీని సేవలను చైనా పొడిగించింది. 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది.


సుదూర నక్షత్రాన్ని గుర్తించిన నాసా
విశ్వంలోని అనంత దూరంలో అతి పెద్దదైన నీలం రంగు నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించినట్లు నాసా ఏప్రిల్ 3న ప్రకటించింది. ఈ నక్షత్రానికి ఇకరస్‌గా నామకరణం చేసింది. భూమి నుంచి 9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్ర మండలంలో దీనిని గుర్తించారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ ఆధారంగా ఈ నక్షత్రాన్ని పెద్దదిగా చేసి కాంతిని పరిశీలించారు.
విశ్వంలో పెద్ద సమూహాల నక్షత్ర మండలాల గురుత్వాక్షరణ శక్తి సాధారణ లెన్‌‌సగా పని చేసినప్పుడు కాంతిని వంచడం వల్ల గురుత్వాక్షరణ లెన్సింగ్ ఏర్పడుతుంది. ఈ గురుత్వాక్షరణ శక్తితో పాటు హబుల్ టెలిస్కోప్ సామర్థ్యాన్ని కలిపి ఈ నక్షత్రాన్ని అధ్యయనం చేశారు.

ఖండాంతర క్షిపణి సర్మత్‌ను పరీక్షించిన రష్యా
అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) సర్మత్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా సైన్యం మార్చి 30న ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరొందిన వొయేవోడా(సాతాన్) స్థానంలో సర్మత్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని బరువు 200 టన్నులు.





మార్చి 2018 సైన్స్ & టెక్నాలజీ

స్వదేశీ సీకర్‌తో 'బ్రహ్మోస్' పరీక్ష విజయవంతం ::
అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన ఆర్‌ఎఫ్ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌రేంజ్‌లో మార్చి 22న ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ శివార్లలో ఉన్న డీఆర్‌డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. 
మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్ -30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించారు. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్ 300 కేజీల వార్‌హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. గతేడాది భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు. 


శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన పాక్ :: 

శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మార్చి 22న ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు. అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్ పరిశోధకుడు జెంగ్ మెంగ్వెయ్ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది. 

బ్లాక్‌హోల్‌కు స్టీఫెన్ హాకింగ్‌గా నామకరణం ::  
తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించి, బ్లాక్‌హోల్స్(కృష్ణబిలం) గురించి ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజెప్పిన ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును ఓ బ్లాక్‌హోల్‌కు పెట్టారు. ఈ బ్లాక్‌హోల్‌ను హాకింగ్ మరణించిన రెండు రోజుల తర్వాతే గుర్తించిన రష్యన్ వ్యోమగాములు.. సదరు కృష్ణబిలానికి 'స్టీఫెన్ హాకింగ్'గా నామకరణం చేశారు. 
కొత్తగా కనిపెట్టిన బ్లాక్‌హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉందని మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్‌బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే పేలుళ్లు చాలా శక్తిమంతమైన పేలుళ్లని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని, కానీ రష్యన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధించారని వివరించారు. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించారు. దీనిపై పరిశోధన కొనసాగించేందుకు స్టీఫెన్ హాకింగ్ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని భావించినందునే ఆయన పేరును పెట్టారు. అలాగే.. ఈ ఆవిష్కరణను జీఆర్‌బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు.

వేగవంతమైన విమానాన్ని అభివృద్ధి చేస్తున్న చైనా  :: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. వాహనాలు రోడ్డుపైన, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు గాలి బలంగా వీస్తుండటం తెలిసిందే. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు తదితరాలపై అలా వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు దీనిపై గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని పరీక్షిస్తారు. అందుకోసమే చైనా ఈ 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోంది. 


ఇంటర్నెట్ వేగంలో చెన్నై టాప్ :: 
దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో..చెన్నై అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా నిలిచింది. కాగా, రెండో స్థానంలో బెంగళూరు; మూడో స్థానంలో హైదరాబాద్; నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. అమెరికాలోని సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ఊక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించింది. దీనికి సంబంధించిన నివేదికను మార్చి 13న విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్ వేగం పరంగా భారత్‌కు 67వ స్థానం లభించడం గమనార్హం.

చంద్రుడిపై 4జీ సేవలకు ప్రయత్నాలు :: 4జీ నెట్‌వర్క్‌ను చంద్రమండలానికి విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచి.. దాదాపు 50ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో.. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీకి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన పీటీ స్పేస్ కంపెనీ సైంటిస్టుల సహకారంతో వొడాఫోన్, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిషన్ మూన్‌లో భాగంగా 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు ల కోసం తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా హెచ్‌డీ వీడియోను ప్రసారం చేసి, ప్రత్యేక అనుభూతి కల్పిస్తామని కూడా వొడాఫోన్ ప్రకటించింది. 


భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం :: 
కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలోని భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి దశను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2018, మార్చి 1న ప్రారంభించారు. ఈ కేంద్రం సామర్థ్యం 2,000 మెగావాట్లు. రూ.16,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సౌర పార్‌‌క మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించింది.







ఫిబ్రవరి 2018 సైన్స్ & టెక్నాలజీ

సైనిక లాంఛనాలతో వజ్రకు వీడ్కోలు 
దాదాపు 30 ఏళ్లకుపైగా తీరరక్షణ విధులు నిర్వర్తించిన వజ్ర నౌకకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. పారాదీప్‌లో ఫిబ్రవరి 21న జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం నౌకపై రెపరెపలాడిన ధ్వజాన్ని అవనతం చేశారు. మేజగాన్ డాక్‌యార్డ్‌లో పురుడుపోసుకున్న ఈ నౌకకు ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధం పేరును పెట్టారు. 1988, డిసెంబర్ 22న ఇది నేవీలోకి ప్రవేశించింది. పారాదీప్ తీరరక్షణ విభాగంలోకి 2013, ఏప్రిల్ 11న ప్రవేశించి, నిర్విరామంగా సేవలందించింది. 


పశ్చిమ టెక్సాస్‌లో 10,000 ఏళ్ల భారీ గడియారం
అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్ లాంగ్ నౌ) రూపొందిస్తున్నట్లు ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్ ఆధారంగా శక్తి చేకూరుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు. 
అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్ బిజోస్ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చింది. అమెరికాలోని టెక్సాస్ కొండల్లో రూ.272.20 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్ పద్ధతిలో, 5 అంకెల రూపంలో తెలుపుతుంది. అంటే 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుంది. ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి 1,000 ఏళ్లకు ఓసారి కూకూ(పక్షిలాంటి నిర్మాణం) బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా రూపొందించడంతో ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 ఏళ్ల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. అయితే ఓసారి మోగిన గంట స్వరం వచ్చే 10 వేల ఏళ్లలో ఎన్నడూ పునరుక్తి కాకుండా దీని రూపకర్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 


ధనుష్’ ప్రయోగం సక్సెస్ 
అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని ఫిబ్రవరి 23న బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది. 


తేజస్ కీలక పరీక్ష విజయవంతం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 26న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన తేజస్ ఎల్‌ఎస్‌పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్ మొట్టమొదటిదని హాల్ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది. 

తమిళనాడుకు తొలి డిఫెన్స్ కారిడార్
దేశంలోనే తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తమిళనాడులో అభివృద్ధి చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. చెన్నై, హొసూర్, కోయంబత్తూర్, సేలం, తిరుచిరాపల్లిలను కలుపుతూ ఈ డిఫెన్‌‌స కారిడార్ ఉండనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం అధికారులు తుదిరూపునిస్తున్నారు. దేశంలో రెండు డిఫెన్‌‌స ఇండస్ట్రియల్ కారిడార్లను నెలకొల్పుతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరో కారిడార్‌ను బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత వారమే ప్రకటించారు. 

రాత్రి వేళలో పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా వేదిక(ఐటీఆర్) నుంచి ఫిబ్రవరి 21న రాత్రి 8.30 గంటలకు క్షిపణిని ప్రయోగించగా..లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది.

రుస్తుం-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత విమానం.. రుస్తుం-2 వైమానిక పరీక్షలను విజయవంతంగా చూర్తి చేసుకుంది. శాస్త్రవేత్తలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఫిబ్రవరి 25న ఈ పరీక్షలను నిర్వహించారు.

హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం
డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

మార్స్‌పై చారలను గుర్తించిన ఆపర్చునిటీ రోవర్ అరుణగ్రహం (మార్స్)పై శోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ ఆపర్చునిటీ ఓ కొత్త విషయాన్ని గుర్తించింది. అక్కడ రాళ్లపై చారలను కనుగొంది. ఈ చారలకు భూమిపై ఉన్న కొన్ని పర్వతాలపై మట్టి తరచూ గడ్డకట్టడం, కరిగిపోవడం వల్ల ఏర్పడే చారలతో పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ చారలు కొన్నిసార్లు గాలి వీయడం, పై నుంచి నీరు పారడం వంటి కారణాలతో కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ రోవర్ 2004 జనవరిలో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఇది 5 వేల అరుణగ్రహం రోజులను పూర్తి చేసుకుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఓ లోయలో అన్వేషణ సాగిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అర్వింద్‌సన్ రాయ్ తెలిపారు. 


హాక్-ఐకి స్వదేశీ చోదక వ్యవస్థదేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆర్టీవోఎస్)తో రూపొందిన హాక్-ఐ యుద్ధ శిక్షణ విమానాన్ని హెచ్‌ఏఎల్ తొలిసారిగా పరీక్షించింది. ఆర్టీవోఎస్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్‌ఏఎల్ తయారుచేసింది. ఈ విమానాలను యుద్ధ అవసరాలకు, శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. బ్రిటన్ మాతృకగా గల ఈ విమానాల్లో భారత్ తన అవసరాలకు తగినట్లుగా ఆర్టీవోఎస్‌ను నిక్షిప్తం చేసింది. ఇది ఫిబ్రవరి 7న విజయవంతంగా గగనవిహారం చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రోగ్రామ్‌లను చాలా కచ్చితత్వంతో అమలు చేయడం ఈ విమానం ప్రత్యేకత. 


పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం 
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘ఉపరితలం నుంచి ఉపరితలంలోకి’ ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఫిబ్రవరి 7న ఒడిశాలోని బాలసోర్‌లో సమీపంలో ఉన్న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదికపై మొబైల్ లాంచర్ సాయంతో ఈ క్షిపణిని ప్రయోగించారు. 500 నుంచి 1000 కిలోగ్రాముల వార్‌హెడ్‌‌సను పృథ్వీ-2 రెండు ఇంజిన్లతో సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ ప్రయోగ గమనాన్ని డీఆర్‌డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు ఒడిశా తీరం వెంబడి ఉన్న టెలీమెట్రీ స్టేషన్ల సాయంతో పర్యవేక్షించారు. 


ఫాల్కన్ హేవీ రాకెట్ ప్రయోగం విజయవంతం 
ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 

కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’.. 
తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది. 

ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు: 
ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికై తే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

న్యూ హారిజాన్‌‌స స్పేస్ క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర 
నాసాకు చెందిన న్యూ హారిజాన్‌‌స స్పేస్‌క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ సాధించని రికార్డును తన పేరిట నమోదుచేసింది. సౌరకుటుంబంలో చివరిగా ఉంటూ.. కొన్నేళ్ల కిందట గ్రహం హోదా కోల్పోయిన ప్లూటో గురించి ఇప్పటికే ఎంతో సమాచారం అందించిన ఘనత ఈ న్యూ హారిజాన్‌‌స సొంతం. కాగా తాజాగా భూమికి సుదూరాన ఉన్న నక్షత్ర మండలి ఫొటోలను తీసి కొత్త రికార్డు సృష్టించింది. భూమికి 1,300 కాంతి సంవత్సరాల దూరంలో క్యూపర్ బెల్ట్‌లోని నక్షత్ర సమూహానికి చెందిన అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను న్యూ హారిజాన్‌‌స తీసింది. ఆ సయమంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 612 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. తన అత్యాధునిక లాంగ్ రేంజ్ రీకానిసెన్‌‌స ఇమేజర్ కెమెరాను ఆన్ చేసి ఈ అద్భుత చిత్రాలను తీసింది. ఈ క్రమంలో గతంలో నాసాకే చెందిన వోయేజర్స్ 1 రికార్డును కూడా బీట్ చేసింది. వోయెజర్స్ స్పేస్‌క్రాఫ్ట్ అత్యధికంగా 606 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లి ఫొటోలు తీసింది. ఇప్పుడు న్యూ హారిజాన్‌‌స ఆ దూరాన్ని దాటి ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ రోజుకు 11 లక్షల కిలోమీటర్ల వేగంతో విశ్వంలో దూసుకెళ్తోంది. 

కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్
పాకిస్తాన్ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్‌‌స చీఫ్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డెరైక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్‌‌స డ్యాన్ కోట్స్ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా పాక్ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు. 


దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం
భారత అటవీ నివేదిక- 2017ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్థన్ ఫిబ్రవరి 12న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2015-17 మధ్యకాలంలో భారత అటవీ విస్తీర్ణం 0.21 శాతం మేర పెరిగింది. దేశం మొత్తం అటవీ విస్తీర్ణం 7,08,273 చ.కి.మీ.గా ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.53 శాతం వాటాను కలిగి ఉంది.

ల్యాబ్‌లో మానవ అండాల అభివృద్ధి
బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ అండాలను ప్రయోగశాలలో విజయవంతంగా పెంచారు. ఇవి మానవ అండాల అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని లండన్‌లో ఫిబ్రవరి 9న వెల్లడించారు. కాగా, ఎలుకల అండాలను దాదాపు 20 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా 25-40 ఏళ్ల వయసు కలిగిన 10 మంది మహిళల నుంచి అండాశయ కణజాలాన్ని సేకరించారు.

కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ జనవరి 31న కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు. 
పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. జనవరి 31న ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.


స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి కరంజ్ జలప్రవేశం
భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా జనవరి 31న ముంబైలో ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్‌ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ కరంజ్‌గా నామకరణం చేశారు. 


చెన్నైలో కృత్రిమ చెవి తయారీ 
దేశంలోనే ప్రప్రథమంగా చెన్నై సైన్స్ ల్యాబ్‌లో వైద్యులు కృత్రిమ చెవిని రూపొందించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు సిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చెవి నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, సిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా దీనిని రూపొందించింది. చెవులు కోల్పోయిన వారి కోసం వారి దేహంలోని ఒక ప్రదేశంలో కణాలను తీసుకొని ల్యాబ్‌లో కృత్రిమ చెవులను తయారు చేస్తున్నారు. 


అగ్ని-1 పరీక్ష విజయవంతం 
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి 2004లోనే సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా దీనిని పరీక్షించారు. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 క్షిపణిలో ఉందని అధికారులు తెలిపారు. రేంజ్, అక్యూరెసీలో అగ్ని -1 అత్యద్భుత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయి్య కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 క్షిపణిని 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు. 


అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతం
జపాన్ అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకె ట్(ఎస్‌ఎస్-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్-520 పొడవు 10 మీటర్లు కాగా, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది. 

విహరించిన తేలికపాటి హెలికాప్టర్
భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్‌సీహెచ్-టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.







Sunday, 11 February 2018

జనవరి 2018 సైన్స్ & టెక్నాలజీ

భూ అధ్యయనానికి నాసా గోల్డ్ మిషన్’ 
భూ వాతావరణం, అంతరిక్షం కలిసే చోట వాతావరణ పొరల్లోని మార్పుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు అంతరిక్ష సంస్థ నాసా తొలిసారి ప్రత్యేక మిషన్‌ను అంతరిక్షంలోకి పంపింది. ‘ద గ్లోబల్ స్కేల్ అబ్జర్వేషన్‌‌స ఆఫ్ ద లింబ్ అండ్ డిస్క్(గోల్డ్)’గా పిలిచే ఈ మిషన్‌ను ఫ్రెంచ్ గయనాలోని కౌరు నుంచి ‘ఎస్‌ఈఎస్-13’ సమాచార ఉపగ్రహానికి అనుసంధానించి జనవరి 26న ప్రయోగించింది. భూ వాతావరణంలోని చిట్టచివరి పొరల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదయస్కాంత క్షేత్రాల్లో మార్పుల్ని ఈ మిషన్ అంచనావేస్తుంది. 
భూవాతావరణం, అంతరిక్షం కలిసే ఈ ప్రాంతంలో విద్యుదయస్కాంత అణువులతో కూడిన అయనోస్పియర్, తటస్థ వాతావరణంతో కూడిన థర్మోస్పియర్‌లు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. జీపీఎస్ వ్యవస్థ, రేడియో సిగ్నల్స్నిప్రభావితం చేసే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ‘గోల్డ్’ వ్యవస్థలో తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. 


చైనాలో కృత్రిమ చంద్రుడిపై విద్యార్థుల పరిశోధన
చైనాకు చెందిన కొందరు విద్యార్థులు భూమిపై చంద్రుడిని పోలిన వాతావరణాన్ని కృత్రిమంగా ల్యాబ్‌లో సృష్టించి సుమారు 200 రోజుల పాటు అందులో గడిపారు. చైనాలోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు యూగ్యాంగ్-1 పేరుతో సుమారు 160 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. 
తొలుత అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు చొప్పున ల్యాబ్‌లోకి ప్రవేశించి 60 రోజుల పాటు చంద్రుడి వాతావరణంలో జీవించి బయటకు వచ్చారు. అనంతరం వీరి స్థానంలో మరో నలుగురు వలంటీర్లు ల్యాబ్‌లోకి ప్రవేశించి 200 రోజుల పాటు అందులోనే ఉన్నారు. వీరు ల్యాబ్‌లో ఉన్నప్పుడు బయట నుంచి ఎటువంటి సహాయం తీసుకోలేదని.. ఈ ప్రయోగంలో వలంటీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారని ప్రాజెక్టు ముఖ్య రూపకర్త లి హాంగ్ వెల్లడించారు. ల్యాబ్‌లో ఉన్న సమయంలో వలంటీర్లు స్వయంగా కూరగాయలు, పంటలను ఆహార వ్యర్థపదార్థాల సహాయంతో పండించుకున్నారని తెలిపింది. చంద్రుడిపైకి మనుషులను పంపి శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని భావిస్తున్న చైనాకు ఆ దేశ విద్యార్థులు చేసిన ప్రయోగం ఓ దిక్సూచిగా నిలవనుంది. 
 

సరస్ విమాన ప్రయోగం విజయవంతం
బెంగళూరులోని నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఎల్) అభివృద్ధి చేసిన 14 సీట్ల సరస్ విమానాన్ని జనవరి 24న విజయవంతంగా పరీక్షించారు.

ఫాస్టెస్ట్ ప్లేన్‌ను రూపొందిస్తున్న అమెరికా ప్రపంచం అత్యంత వేగంతో ప్రయాణించే విమానాన్ని అమెరికా రూపొందిస్తోంది. ఆ దేశానికి చెందిన ఫైటర్ జెట్ల తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ స్పై ప్లేన్ ‘ఎస్‌ఆర్-72 బ్లాక్‌బర్డ్’ను అభివృద్ధి చేస్తోంది. కోల్డ్‌వార్ సమయంలో ఎస్‌ఆర్-71 బ్లాక్‌బర్డ్ విమానం ద్వారా రష్యాపై అమెరికా గూఢచర్యం నిర్వహించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్-71 విధుల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అమెరికా ఎలాంటి స్పై జెట్‌ను రూపొందించలేదు. తాజాగా రూపొందుతున్న ఎస్‌ఆర్-72ను ‘సన్ ఆఫ్ బ్లాక్‌బర్డ్’ గా లాక్ హీడ్ మార్టిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. 2030లో ఈ ప్లేన్ రంగంలోకి దిగుతుందని అంచనా వేస్తున్నారు. హైపర్ సోనిక్ టెక్నాలజీని వినియోగించడం వల్ల ధ్వనివేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ(మాక్-6)వేగంతో ఎస్‌ఆర్-72 ప్రయాణిస్తుంది. కోల్డ్‌వార్ సమయంలో సేవలందిచిన ఎస్‌ఆర్-71 మాక్-3.5 వేగం (సుమారు గంటకు 2వేల కిలోమీటర్లు)తో ప్రయాణించేది. 

అగ్ని-5 పరీక్ష విజయవంతంఅణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి కానిస్టర్ ద్వారా జనవరి 18న ఈ క్షిపణిని పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి.
అగ్ని శ్రేణిలో ‘అగ్ని-5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధి చేశారు. విస్తారమైన నావిగేషన్ వ్యవస్థ (ఆర్‌ఐఎన్‌ఎస్), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు. 
అగ్ని శ్రేణిలో క్షిపణులు.. 
క్షిపణి
లక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం
అగ్ని-1
700 కి.మీ.
అగ్ని-2
2000 కి.మీ.
అగ్ని-3
2,500 నుంచి 3,500 కి.మీ.
అగ్ని-5
5,000 కి.మీ.

రష్యా నుంచి భారత్‌కు ‘ట్రయంఫ్’ క్షిపణి వ్యవస్థ రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు సంబంధించిన తుది చర్చలను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే భారత్‌కు ఆకాశ్, బరాక్-8 తదితర క్షిపణి వ్యవస్థలుండగా.. ఎస్-400 ట్రయంఫ్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకు కారణం ఇది అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి కావడమే. ఈ నేపథ్యంలో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల గురించి క్లుప్తంగా.. 
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లోనే నిర్ణయించింది. ఆ ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణుల కొనుగోలు ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్‌‌స అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించింది. ప్రస్తుతం తుది చర్చలను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఒప్పందాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఒప్పందం ఖరారైతే చైనా తర్వాత ఈ క్షిపణులను కొనుగోలు చేయనున్న రెండో దేశంగా భారత్ నిలవనుంది. చైనా 2014లోనే ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది.
ఎప్పటికి వస్తాయి? మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుండగా, డీల్ కుదిరిన వెంటనే తొలి క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరనుంది. అయితే దీనికి అనుబంధంగా ఉండే కొన్ని యుద్ధ నిర్వహణ పరికరాలు రావడానికి మాత్రం రెండేళ్ల సమయం పడుతుంది. మొత్తం ఐదు క్షిపణులు భారత అమ్ములపొదిలో చేరడానికి నాలుగున్నరేళ్ల వ్యవధి అవసరమని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్-రష్యాల మధ్య కుదిరిన భారీ ఆయుధ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. 
ట్రయంఫ్-400 ప్రత్యేకతలుశత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 600 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు. ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు. ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు. భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో పాక్‌పై భారత్ పైచేయి సాధించడంతోపాటు, చైనాతో సరిసమానంగా నిలిచేందుకు ఎస్-400 ట్రయంఫ్ దోహదపడనుంది. పాకిస్తాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణి నాస్‌న్రు ఇది దీటుగా ఎదుర్కొంటుంది. వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది. 

భారత్ వద్ద ఉన్న క్షిపణులుస్పైడర్ ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన దీని పరిధి 15 కిలోమీటర్లు. వాయుసేన 4 క్షిపణులను సమకూర్చుకుంటోంది. పరిధిని 30 కిలో మీటర్లకు పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయత్నిస్తోంది. 
ఆకాశ్ డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 25 కిలోమీటర్లు. వాయుసేన 15 ఆకాశ్ స్క్వాడ్రన్లు, ఆర్మీ నాలుగు ఆకాశ్ రెజిమెంట్లను సమకూర్చుకుంటోంది. 
బరాక్-8 డీఆర్‌డీవో-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన దీని పరిధి 70 కిలో మీటర్లు. వాయుసేన 9 క్షిపణులను సమకూర్చుకుంటోంది. యుద్ధనౌకలకు ఈ క్షిపణి వ్యవస్థలను నౌకాదళం అమర్చుకుంటోంది.

దిగ్విజయంగా నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ - 40భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఇస్రో తన వందో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వేదికగా 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత జనవరి 12న ఈ ప్రయోగం జరిగింది. నాలుగు ప్రయోగ దశల్లో మండిన పీఎస్‌ఎల్వీ సీ-40 వాహకనౌక కార్టోశాట్-2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు 30 మైక్రో, నానో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేర్చింది. దీంతో అంతరిక్ష రంగంలో, వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో తన సమర్ధతను మరోసారి చాటుకున్నట్లయింది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రయోగం ఇదే. 
మైలురాయిగా 100వ ఉపగ్రహం... 
నాలుగు నెలల క్రితం నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగ సందర్భంగా ఎదురైన వైఫల్యాన్ని పక్కనపెట్టి ఇస్రో తాజా విజయాన్ని అందుకుంది. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం ఉండటం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-40 31 ఉపగ్రహాలతో నింగికెగిసింది. 17 నిమిషాల్లోనే కార్టోశాట్ ఉపగ్రహాన్ని 505 కి.మీ ఎత్తులోని సూర్యానువర్తిత ధృవకక్ష్యలో చేర్చింది. తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలో భారత్‌కు చెందిన ఒక నానో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 28 పేలోడ్‌లను ఒకదాని తర్వాత మరోదాన్ని కక్ష్యల్లో విడిచిపెట్టింది. మిగిలిన ఏకైక(వందో ఉపగ్రహం) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందుకోసం ప్రయోగం ప్రారంభమైన సుమారు 105 నిమిషాల తరువాత రాకెట్ నాలుగో దహన దశను రెండుసార్లు పునఃప్రారంభించారు. చివరి దశను పూర్తిచేయడానికి సుమారు 2 గంటల 21 నిమిషాలు పట్టింది. అత్యంత ఎక్కువ సమయం తీసుకున్న పీఎస్‌ఎల్వీ మిషన్ ఇదే. 
ఇస్రో చైర్మన్‌గా చివరి ప్రయోగాన్ని విజయవంతంగా ముగించిన కిరణ్ కుమార్ సహచరులతో కలసి సంతోషం పంచుకున్నారు. కార్టోశాట్-2 వెంట ప్రయాణించిన ఉపగ్రహాల్లో కెనడా, ఫిన్‌లాండ్, ఫ్రాన్‌‌స, కొరియా, యూకే, అమెరికాలకు చెందిన మూడు మైక్రో, 25 నానో ఉపగ్రహాలున్నాయి. 

భారత సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ ఆవిష్కరణభారత్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్‌ను 2018, జనవరి 8న ఆవిష్కరించింది. ఇది గరిష్టంగా 6.8 పెటాప్లాప్‌ల వేగంతో పనిచేయగలదు. ఇక పెటాప్లాప్ అంటే.. సెకనుకు 1000 ట్రిలియన్ ఆపరేషన్‌‌స చేసే సామర్థ్యం. ప్రత్యూష్‌ను వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి వినియోగించనున్నట్లు పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ తెలియజేసింది. తద్వారా ఇలా వాతావరణం, శీతోష్ణస్థితి అధ్యయనానికి సూపర్ కంప్యూటర్‌లను వినియోగించడంలో జపాన్, యూకే, యూఎస్‌ఏ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లయింది.

ఓక్కీ తుపాను రికార్డు ప్రయాణం ఇటీవల తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లను కుదిపేసిన ఓక్కీ తుపాను 2,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వాతావరణ శాస్త్రవేత్త రామచంద్రన్ తెలిపారు. గత నలభై ఏళ్లలో బంగాళాఖాతంలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. 2017 నవంబర్ 28న ఓక్కీ అల్పపీడనంగా ప్రారంభమై 30వ తేదీన కన్యాకుమారి తీరాన్ని కుదిపేసింది. డిసెంబర్ 6న బలహీనపడింది.
 శాఖ 

అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎం77232917 ప్రపచంలోనే ఇప్పటి వరకు తెలిసిన అతిపెద్ద ప్రధాన సంఖ్యను ఔత్సాహిక శాస్త్రవేత్త ఒకరు కనుగొన్నారు. 2017 డిసెంబర్ 26న అమెరికాకు చెందిన జొనాథన్ పేస్ అనే 51 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈ ఘనత సాధించారు. 2ను 7,72,32,917 సార్లు గుణించి, ఆ తర్వాత అందులో నుంచి ‘1’ ని తీసివేశారు. ఆ వచ్చిన సంఖ్యలో 2,32,49,425 అంకెలున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ప్రధాన సంఖ్య కన్నా ఎం77232917 అని పిలుస్తున్న ఈ కొత్త ప్రధాన సంఖ్యలో దాదాపు 10 లక్షల అంకెలు ఎక్కువగా ఉన్నాయి. 350 ఏళ్ల కిందటే ఈ ప్రధాన సంఖ్యల గురించి అధ్యయనం చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త మారిన్ మెర్సెన్నె పేరు వీటికి పెట్టారు. ఈ కొత్త ప్రధాన సంఖ్యను ఆరు రోజుల పాటు ఆగకుండా లెక్కించారు. ఎం77232917 ఇప్పటి వరకు కనుగొన్న 50వ మెర్సెన్నె ప్రధాన సంఖ్య. గ్రేట్ ఇంటర్నెట్ మెర్సెన్నె ప్రైమ్ సెర్చ్ (జీఐఎంపీఎస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రధాన సంఖ్యలు కనుగొనేందుకు వేల మంది వలంటీర్లు నిత్యం ప్రయతిస్తుంటారు. 


క్రూయిజ్ క్షిపణి హర్భాను పరీక్షించిన పాక్స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రూయిజ్ క్షిపణి హర్బాను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ నౌకాదళం జనవరి 3న ప్రకటించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితల, భూభాగ లక్ష్యాలను ఛేదించగలదు.

సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 
డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.
 

ఒక్క రోజులో 16 న్యూ ఇయర్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్ - ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో ఆరుగురు వ్యోమగాములు 2018 కొత్త ఏడాదిని ఒకేరోజులో 16 సార్లు జరుపుకోనున్నారు. భూమికి 402 కి.మీ. ఎత్తులో ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేస్తూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను చూడటం ద్వారా వారు దీనిని సుసాధ్యం చేయనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) డిసెంబర్ 29న వెల్లడించింది. 

కోల్‌కతాలో రెండో టీయూ-142 మ్యూజియంభారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు.

రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ-142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చి 29 ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్ కొనుగోలు చేసింది. నేవీ సేవల నుంచి నిష్ర్కమించిన టీయూ-142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని 2017 డిసెంబర్ 7న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజైన డిసెంబర్ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్‌చార్జిగా పంపనున్నారు.


చెమట చిందించే రోబో ఆవిష్కరణపుష్ అప్స్, పుల్ అప్స్ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘కెంగొరో’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. కృత్రిమ స్వేద వ్యవస్థతో పాటు మానవ కండరాలను పోలిన అస్థిపంజరాన్ని రోబోలో అమర్చారు. క్రీడాకారుల కండరాల పనితీరును విశ్లేషించేందుకుగాను దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృత్రిమ స్వేద వ్యవస్థలో తాము కీలకమైన ముందడుగు వేశామని, దీని ద్వారా రోబోలోని అధిక వేడిని తగ్గించవచ్చని వెల్లడించారు. 2001 నుంచి ఈ బృందం రోబోలపై పరిశోధనలు జరుపుతోందని సైన్‌‌స రోబోటిక్స్ అనే జర్నల్ ప్రచురించింది. 




డిసెంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ

నీటిని శోషించుకున్న మార్స్ ఉపరితలం 
అంగారక గ్రహంపై ఒకప్పుడు నదిలా ప్రవహించిన నీటిని అంగారక గ్రహ ఉపరితలం స్పాంజ్ మాదిరిగా శోషించుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల కంటే మార్స్ ఉపరితలంపై రాళ్లు 25 శాతం అధికంగా నీటిని శోషించుకుంటాయని గుర్తించారు. ఎప్పటినుంచో ఈ విధంగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా.. తొలిసారి తాము మాత్రం ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించామని వర్సిటీకి చెందిన పరిశోధకులు జాన్ వేడ్ వెల్లడించారు. ఇప్పటివరకు అయస్కాంత క్షేత్రం ఒక్కసారిగా పతనమవడంతో నీరు అంతరిక్షంలోకి మళ్లిందని పరిశోధకులు భావించేవారు. 

ఫేస్‌బుక్ కొత్త ఖాతాకు ఆధార్నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. 

తొలిసారి ఎగిరిన ఉభయచర విమానం ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం తొలిసారి డిసెంబర్ 24న గాల్లోకి ఎగిరింది. దీన్ని చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. కున్లాంగ్(ఎజీ600)గా పిలిచే ఈ విమానం దక్షిణ చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లోని జుహాయ్ విమానాశ్రయం నుంచి గాల్లోకి దూసుకెళ్లినట్లు చైనా వార్తా సంస్థ షిన్ హువా తెలిపింది.

ఐఎన్‌ఎస్ కల్వరి జలప్రవేశంస్కార్పిన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ కల్వరి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 14న ముంబైలో భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ జలాంతర్గామిని ఫ్రెంచ్ కంపెనీ డీసీఎన్‌ఎస్ డిజైన్ చేయగా రక్షణ శాఖకు చెందిన మజగాన్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్-ముంబై) నిర్మించింది. హిందూ మహాసముద్రంలోని భయంకరమైన ‘టైగర్’ షార్క్ (మలయాళంలో కల్వరి అంటారు) పేరును ఈ జలాంతర్గామికి పెట్టారు. స్కార్పిన్ సిరీస్‌లో మొత్తం ఆరు సబ్‌మెరైన్లు నిర్మిస్తుండగా అందులో కల్వరి మొదటిది.
కల్వరి ప్రత్యేకతలుజలాంతర్గామి జాడ చిక్కకుండా ధ్వనిని అదుపు చేసే అత్యాధునిక సాంకేతికత. 
యాంటీ షిప్ క్షిపణులతో నీళ్లలోను, సముద్ర ఉపరితలంపైనా దాడిచేయవచ్చు. 
రేడియేషన్ స్థాయిలు అతి తక్కువగా ఉంటాయి. 
పొడవు: 67.5 మీ (221 అడుగులు)
వేగం: నీటిలో ఉన్నప్పుడు గంటకు 37 కి.మీ.
సముద్ర ఉపరితలంపై గంటకు 22 కి.మీ.
పరిధి: ఉపరితలంపై 12,000 కి.మీ. నీటిలో ఉన్నప్పుడు 1,020 కి.మీ.
18 టార్పెడోలను మోసుకెళ్లగలదు. 350 మీటర్ల లోతుకు వెళ్లగలదు


కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం గుర్తింపునాసా కృత్రిమ మేధ సాయంతో కెప్లర్ 90 సౌరవ్యవస్థలో 8వ గ్రహం కెప్లర్ 90ఐ ను డిసెంబర్ 14న గుర్తించింది. కెప్లర్ 90 గ్రహ వ్యవస్థ భూమికి 2,545 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 90ఐ గ్రహం మాతృ నక్షత్రం చుట్టూ ఒక సారి తిరిగేందుకు 14.4 రోజుల సమయం తీసుకుంటుంది. దీని ద్రవ్యరాశి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ. గ్రహం మొత్తమ్మీద ఉండే ఉష్ణోగ్రత 436 డిగ్రీల సెల్సియస్. భూమిని పోలిన గ్రహాలను గుర్తించేందుకు నాసా 2009లో కెప్లర్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. నాలుగేళ్లలో 35 వేల గ్రహాల ఉనికిపై కెప్లర్ సంకేతాలిచ్చింది.
కెప్లర్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో గ్రహాల ఉనికిని గుర్తించడంపై కృత్రిమ మేధకు శిక్షణ ఇచ్చారు. బలహీనమైన సంకేతాలున్న 670 గ్రహ వ్యవస్థల సమాచారాన్ని కంప్యూటర్‌కు ఫీడ్ చేశారు. దాన్ని పరిశీలించిన కంప్యూటర్.. కెప్లర్ 90, కెప్లర్ 80 గ్రహ వ్యవస్థల్లో ఒక్కో కొత్త గ్రహం ఉన్నట్లు గుర్తించింది. కెప్లర్ 90లో 7 గ్రహాలను ఇప్పటికే గుర్తించారు. సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహ వ్యవస్థలో 7 గ్రహాలతో ట్రాపిస్ట్-1 మొదటి స్థానంలో ఉంది.
గ్రావిటీ లెన్సింగ్ అంటే?ప్రకాశవంతమైన నక్షత్రం ముందు నుంచి గ్రహం వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెలుగు కొంచెం తగ్గుతుంది. ఈ తగ్గుదలను బట్టి అక్కడ గ్రహం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. దీనినే గ్రావిటీ లెన్సింగ్ అంటారు. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహాలను గుర్తించేందుకు ఈ పద్ధతిని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తారు.


ఎంఐ-8 హెలికాప్టర్లకు వీడ్కోలు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ-8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన డిసెంబర్ 17న అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. 


సుఖోయ్‌కు బ్రహ్మోస్ అమర్చే ప్రక్రియ ప్రారంభంరష్యన్ తయారీ సుఖోయ్-30 యుద్ధవిమానాల్లో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తవుతుంది. సుఖోయ్-30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్ 22న ప్రయోగించారు. సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేపట్టింది. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్-రష్యా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.


రామసేతు మానవ నిర్మాణమే: సైన్స్ చానల్రామసేతు (Adam's Bridge) అనేది వేల సంవత్సరాల కింద మానవుడు నిర్మించినదేనని అమెరికా డిస్కవరీ కమ్యూనికేషన్‌‌స సంస్థకు చెందిన సైన్స్ చానల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఇందులో పలువురు భూగర్భ, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ ఆ నిర్మాణం సహజసిద్ధమైనది కాదని తేల్చింది. రామసేతువు వేల సంవత్సరాలుగా భూ పలకల్లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన సహజ సిద్ధ నిర్మాణమనే వాదన మరోవైపు ఉంది. ఇది తమిళనాడులోని పంబన్, శ్రీలంకలోని మన్నార్ దీవుల మధ్య దాదాపు 50 కిలోమీటర్ల దూరంపాటు సముద్రంలో ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక సహజసిద్ధంగా ఏర్పడినది కాగా, దానిపై ఉన్న రాళ్లు మాత్రం కృత్రిమంగా తీసుకొచ్చి పేర్చినట్లు ఉన్నాయని అలన్ లెస్టర్ అనే భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు తెలిపారు. రామ సేతువు ప్రాంతంలో ఉన్న రాళ్లు 7 వేల ఏళ్ల పురాతనమైనవి కాగా, రామసేతువును దాదాపు 5 వేల ఏళ్ల క్రితం నిర్మించి ఉంటారనీ ఆ చానల్ పేర్కొంది.
రామసేతువు నిర్మాణాన్ని పరిశోధించే బాధ్యతను గతంలో భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్)కు అప్పగించారు. ప్రస్తుతం ఈ పరిశోధన కొనసాగుతోంది. అయితే చరిత్రలోని క్రీ.పూ 4,000- క్రీ.పూ 1,000ల మధ్య కాలాన్ని ‘డార్క్ పీరియడ్’గా పరిగణించి మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీహెచ్‌ఆర్ చైర్మన్ వై.సుదర్శనరావు వివరించారు.


గూగుల్ సెర్చ్‌లో బాహుబలి-2 టాప్2017లో ఇంటర్నెట్‌లో అత్యధికులు శోధించిన అంశాల్లో బాహుబలి-2 చిత్రం తొలిస్థానంలో నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండోస్థానం, ‘లైవ్ క్రికెట్ స్కోర్’ అనే పదం మూడోస్థానంలో నిలిచాయి. ఈ మేరకు గూగుల్ డిసెంబర్ 13న ఒక జాబితా విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ సినిమా దంగల్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, బద్రీనాథ్ కీ దుల్హానియా చిత్రాలు, చాంపియన్‌‌స ట్రోఫీ తదితర అంశాలు టాప్-10లో ఉన్నాయి. ఈ ఏడాదికి ‘సెక్సియెస్ట్ ఏషియన్ మ్యాన్’గా బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ ఎంపికయ్యారు.


బెంగళూరులో అంతరిక్ష మ్యూజియందేశంలోనే తొలిసారిగా అంతరిక్ష విజ్ఞానాన్ని అందించే నూతన మ్యూజియంను నవంబర్ 29న బెంగళూరులో ప్రారంభించారు. ఉపగ్రహ తయారీ మొదలు అది అతరిక్షంలోకి వెళ్లే వరకు ఉండే విశేషాలను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దీనిని విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)తో కలసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేసింది. ఇందులో రాకెట్ బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లే వరకు జరిగే ప్రతి ఘటననూ సిములేటర్ ద్వారా ప్రత్యక్ష అనుభవంలో చూడొచ్చు.