స్వదేశీ సీకర్‌తో 'బ్రహ్మోస్' పరీక్ష విజయవంతం ::
అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన ఆర్‌ఎఫ్ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌రేంజ్‌లో మార్చి 22న ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ శివార్లలో ఉన్న డీఆర్‌డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు.
మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్ -30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించారు. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్ 300 కేజీల వార్‌హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. గతేడాది భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు.
శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన పాక్ ::
శత్రు దేశాల క్షిపణులను గుర్తించి ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ చైనా నుంచి అత్యంత శక్తిమంతమైన క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినట్లు తెలిసింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల అభివృద్ధికి నాలుగు టెలిస్కోపులతో కూడిన అత్యాధునికమైన ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నారు. కొత్త క్షిపణులను పరీక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ ఇప్పటికే దీన్ని రహస్య ప్రదేశంలో వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడైంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (సీఏఎస్) పరిశోధకుడు ఒకరిని ఉటంకిస్తూ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మార్చి 22న ఈ విషయాలను కథనం రూపంలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్ ఈ కొనుగోలు ఒప్పందానికి ఎంత వెచ్చించిందో వెల్లడించలేదు. అత్యాధునిక క్షిపణి నిఘా వ్యవస్థను పాకిస్తాన్‌కు చైనా అమ్మినట్లు సీఏఎస్ పరిశోధకుడు జెంగ్ మెంగ్వెయ్ రూఢీ పరచినట్లు ఆ పత్రిక పేర్కొంది.
బ్లాక్‌హోల్‌కు స్టీఫెన్ హాకింగ్‌గా నామకరణం ::
తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించి, బ్లాక్‌హోల్స్(కృష్ణబిలం) గురించి ఎన్నో విషయాలను ప్రపంచానికి తెలియజెప్పిన ప్రఖ్యాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును ఓ బ్లాక్‌హోల్‌కు పెట్టారు. ఈ బ్లాక్‌హోల్‌ను హాకింగ్ మరణించిన రెండు రోజుల తర్వాతే గుర్తించిన రష్యన్ వ్యోమగాములు.. సదరు కృష్ణబిలానికి 'స్టీఫెన్ హాకింగ్'గా నామకరణం చేశారు.
కొత్తగా కనిపెట్టిన బ్లాక్‌హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉందని మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్‌బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే పేలుళ్లు చాలా శక్తిమంతమైన పేలుళ్లని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని, కానీ రష్యన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధించారని వివరించారు. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించారు. దీనిపై పరిశోధన కొనసాగించేందుకు స్టీఫెన్ హాకింగ్ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని భావించినందునే ఆయన పేరును పెట్టారు. అలాగే.. ఈ ఆవిష్కరణను జీఆర్‌బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు.
వేగవంతమైన విమానాన్ని అభివృద్ధి చేస్తున్న చైనా :: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు రెండు గంటల్లోనే చేరుకోగల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. దీనిని పరీక్షించేందుకు ధ్వని వాయు సొరంగం (హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్)ను చైనా నిర్మిస్తోందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. వాహనాలు రోడ్డుపైన, విమానాలు ఆకాశంలో వెళ్తున్నప్పుడు గాలి బలంగా వీస్తుండటం తెలిసిందే. కొత్తగా తయారైన వాహనాలు, విమానాలు తదితరాలపై అలా వీచే గాలి ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఏరోడైనమిక్స్ పరిశోధనల్లో వాయు సొరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త విమానం ధ్వని వేగానికి 25 రెట్ల అధిక వేగం (మ్యాక్ 25)తో ప్రయాణించగలదు. సాధారణ లెక్కల్లో చెప్పాలంటే గంటకు ఏకంగా 30,625 కిలోమీటర్ల వేగంతో ఇది ఆకాశంలో దూసుకుపోగలదు. అంత వేగంతో వెళ్తున్నప్పుడు దీనిపై గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ పరిస్థితిని కృత్రిమంగా వాయుసొరంగంలో కల్పించి విమానాన్ని పరీక్షిస్తారు. అందుకోసమే చైనా ఈ 265 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తోంది.
ఇంటర్నెట్ వేగంలో చెన్నై టాప్ ::
దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో..చెన్నై అత్యంత వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా నిలిచింది. కాగా, రెండో స్థానంలో బెంగళూరు; మూడో స్థానంలో హైదరాబాద్; నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. అమెరికాలోని సీటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ఊక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించింది. దీనికి సంబంధించిన నివేదికను మార్చి 13న విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్ వేగం పరంగా భారత్‌కు 67వ స్థానం లభించడం గమనార్హం.
చంద్రుడిపై 4జీ సేవలకు ప్రయత్నాలు :: 4జీ నెట్‌వర్క్‌ను చంద్రమండలానికి విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచి.. దాదాపు 50ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో.. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీకి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన పీటీ స్పేస్ కంపెనీ సైంటిస్టుల సహకారంతో వొడాఫోన్, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిషన్ మూన్‌లో భాగంగా 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకు ల కోసం తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా హెచ్‌డీ వీడియోను ప్రసారం చేసి, ప్రత్యేక అనుభూతి కల్పిస్తామని కూడా వొడాఫోన్ ప్రకటించింది.
భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభం ::
కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ సమీపంలోని భారీ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం మొదటి దశను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2018, మార్చి 1న ప్రారంభించారు. ఈ కేంద్రం సామర్థ్యం 2,000 మెగావాట్లు. రూ.16,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సౌర పార్‌క మొదటి దశలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించింది.

No comments:
Post a Comment