సైనిక లాంఛనాలతో వజ్రకు వీడ్కోలు
దాదాపు 30 ఏళ్లకుపైగా తీరరక్షణ విధులు నిర్వర్తించిన వజ్ర నౌకకు సైనిక లాంఛనాలతో వీడ్కోలు పలికారు. పారాదీప్‌లో ఫిబ్రవరి 21న జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం నౌకపై రెపరెపలాడిన ధ్వజాన్ని అవనతం చేశారు. మేజగాన్ డాక్‌యార్డ్‌లో పురుడుపోసుకున్న ఈ నౌకకు ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధం పేరును పెట్టారు. 1988, డిసెంబర్ 22న ఇది నేవీలోకి ప్రవేశించింది. పారాదీప్ తీరరక్షణ విభాగంలోకి 2013, ఏప్రిల్ 11న ప్రవేశించి, నిర్విరామంగా సేవలందించింది.
పశ్చిమ టెక్సాస్‌లో 10,000 ఏళ్ల భారీ గడియారం
అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ పర్వతాల్లో 10,000 సంవత్సరాల వరకూ పనిచేసే భారీ గడియారాన్ని(క్లాక్‌ఆఫ్ లాంగ్ నౌ) రూపొందిస్తున్నట్లు ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. దాదాపు 500 అడుగులు ఎత్తుండే ఈ గడియారానికి భూమి థర్మో సైకిల్స్ ఆధారంగా శక్తి చేకూరుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నామనీ, ప్రస్తుతం టెక్సాస్ కొండల్లో ఈ గడియారాన్ని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన డ్యాని హిల్లీస్ 1989లో భారీ గడియారాన్ని నిర్మించాలన్న ఆలోచన చేశారు. జెఫ్ బిజోస్ చేరికతో భారీ గడియారం ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చింది. అమెరికాలోని టెక్సాస్ కొండల్లో రూ.272.20 కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ గడియారంలో సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్నం సూర్యకాంతి సాయంతో ఈ గడియారం తన సమయాన్ని సరిచేసుకుంటుంది. ఈ గడియారం సమయాన్ని గ్రెగొరియన్ పద్ధతిలో, 5 అంకెల రూపంలో తెలుపుతుంది. అంటే 2018ని ఈ గడియారం 02018గా సూచిస్తుంది. ఇందులోని ఓ ముల్లు ఏడాదికోసారి మాత్రమే కదిలితే.. మరో ముల్లు ప్రతి వందేళ్లకోసారి మాత్రమే ముందుకెళ్తుంది. ప్రతి 1,000 ఏళ్లకు ఓసారి కూకూ(పక్షిలాంటి నిర్మాణం) బయటికొచ్చేలా ఈ గడియారంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా రూపొందించడంతో ప్రతి 20 వేల ఏళ్లలో ఒకరోజు మాత్రమే తేడా వస్తుంది. ఈ భారీ గడియారానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వచ్చే 10,000 ఏళ్ల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం ఈ గడియారంలో గంట మోగుతుంది. అయితే ఓసారి మోగిన గంట స్వరం వచ్చే 10 వేల ఏళ్లలో ఎన్నడూ పునరుక్తి కాకుండా దీని రూపకర్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
‘ధనుష్’ ప్రయోగం సక్సెస్
అణ్వాయుధాలను మోసుకుపోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ధనుష్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని భారత నావికా దళానికి చెందిన ఓ నౌక ద్వారా ధనుష్‌ను పరీక్షించారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది విజయవంతంగా ఛేదించినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ క్షిపణిని నావికా దళ అవసరాల కోసం అభివృద్ధి పరిచి ధనుష్ క్షిపణిగా రూపొందించారు. ఈ క్షిపణిని ఫిబ్రవరి 23న బంగాళాఖాతంలో పారాదీప్ దగ్గర్లోని ఓ నౌక ద్వారా విజయవంతంగా ప్రయోగించినట్టు అధికారులు చెప్పారు. ధనుష్ క్షిపణి 500 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోగలదు. భూ, సముద్ర తలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ధనుష్ ఇప్పటికే భారత రక్షణ బలగాల్లో చేరింది.
తేజస్ కీలక పరీక్ష విజయవంతం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 26న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన తేజస్ ఎల్‌ఎస్‌పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది. ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్ మొట్టమొదటిదని హాల్ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది.
తమిళనాడుకు తొలి డిఫెన్స్ కారిడార్
దేశంలోనే తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను తమిళనాడులో అభివృద్ధి చేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. చెన్నై, హొసూర్, కోయంబత్తూర్, సేలం, తిరుచిరాపల్లిలను కలుపుతూ ఈ డిఫెన్‌స కారిడార్ ఉండనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం అధికారులు తుదిరూపునిస్తున్నారు. దేశంలో రెండు డిఫెన్‌స ఇండస్ట్రియల్ కారిడార్లను నెలకొల్పుతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరో కారిడార్‌ను బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత వారమే ప్రకటించారు.
రాత్రి వేళలో పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా వేదిక(ఐటీఆర్) నుంచి ఫిబ్రవరి 21న రాత్రి 8.30 గంటలకు క్షిపణిని ప్రయోగించగా..లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది.
రుస్తుం-2 పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత విమానం.. రుస్తుం-2 వైమానిక పరీక్షలను విజయవంతంగా చూర్తి చేసుకుంది. శాస్త్రవేత్తలు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఫిబ్రవరి 25న ఈ పరీక్షలను నిర్వహించారు.
హైదరాబాద్‌లో డేటా సైన్స్ కేంద్రం
డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా హైదరాబాద్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
మార్స్‌పై చారలను గుర్తించిన ఆపర్చునిటీ రోవర్ అరుణగ్రహం (మార్స్)పై శోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోవర్ ఆపర్చునిటీ ఓ కొత్త విషయాన్ని గుర్తించింది. అక్కడ రాళ్లపై చారలను కనుగొంది. ఈ చారలకు భూమిపై ఉన్న కొన్ని పర్వతాలపై మట్టి తరచూ గడ్డకట్టడం, కరిగిపోవడం వల్ల ఏర్పడే చారలతో పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ చారలు కొన్నిసార్లు గాలి వీయడం, పై నుంచి నీరు పారడం వంటి కారణాలతో కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ రోవర్ 2004 జనవరిలో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఇది 5 వేల అరుణగ్రహం రోజులను పూర్తి చేసుకుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఓ లోయలో అన్వేషణ సాగిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అర్వింద్‌సన్ రాయ్ తెలిపారు.
హాక్-ఐకి స్వదేశీ చోదక వ్యవస్థదేశంలోనే తొలిసారిగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఆర్టీవోఎస్)తో రూపొందిన హాక్-ఐ యుద్ధ శిక్షణ విమానాన్ని హెచ్‌ఏఎల్ తొలిసారిగా పరీక్షించింది. ఆర్టీవోఎస్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్‌ఏఎల్ తయారుచేసింది. ఈ విమానాలను యుద్ధ అవసరాలకు, శిక్షణకు ఉపయోగించుకోవచ్చు. బ్రిటన్ మాతృకగా గల ఈ విమానాల్లో భారత్ తన అవసరాలకు తగినట్లుగా ఆర్టీవోఎస్‌ను నిక్షిప్తం చేసింది. ఇది ఫిబ్రవరి 7న విజయవంతంగా గగనవిహారం చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రోగ్రామ్‌లను చాలా కచ్చితత్వంతో అమలు చేయడం ఈ విమానం ప్రత్యేకత.
పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా పరీక్షించిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ‘ఉపరితలం నుంచి ఉపరితలంలోకి’ ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఫిబ్రవరి 7న ఒడిశాలోని బాలసోర్‌లో సమీపంలో ఉన్న చాందీపూర్‌లోని ఇంటిగ్రేటేడ్ టెస్ట్ రేంజ్ మూడో వేదికపై మొబైల్ లాంచర్ సాయంతో ఈ క్షిపణిని ప్రయోగించారు. 500 నుంచి 1000 కిలోగ్రాముల వార్‌హెడ్‌సను పృథ్వీ-2 రెండు ఇంజిన్లతో సునాయాసంగా తీసుకెళ్లగలదు. ఈ ప్రయోగ గమనాన్ని డీఆర్‌డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు ఒడిశా తీరం వెంబడి ఉన్న టెలీమెట్రీ స్టేషన్ల సాయంతో పర్యవేక్షించారు.
ఫాల్కన్ హేవీ రాకెట్ ప్రయోగం విజయవంతం
ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని ప్రైవేట్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’(స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్) సుసాధ్యం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. నిప్పులు విరజిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ హెవీ రాకెట్.. స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ కారును అంగారకుడి దగ్గరి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫాల్కన్ హెవీ రాకెట్‌లో అమర్చిన 27 ఇంజిన్లను మండించడం ద్వారా రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

కక్ష్య తప్పి.. సౌరవ్యవస్థలో షి‘కారు’..
తొలుత ప్రయోగం విజయవంతమైనట్లేనని శాస్త్రవేత్తలు, సంస్థ ప్రతినిధులు భావించారు. అయితే ఫాల్కన్ హెవీ రాకెట్ కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిందని ఎలన్ మస్క్ తెలిపారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుంది.

ఫాల్కన్ హెవీ ప్రత్యేకతలు:
ఫాల్కన్ హెవీ రాకెట్‌ను మూడు చిన్న ఫాల్కన్ 9 రాకెట్లను కలిపి రూపొందించారు. అంతేకాకుండా పునర్వినియోగించుకోగలగడం దీని ప్రత్యేకత. 230 అడుగుల ఎత్తు ఉండే ఫాల్కన్ హెవీ రాకెట్ సుమారు 64 మెట్రిక్ టన్నుల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యముంది. ఇది నిండుగా నింపిన 737 జెట్‌లైనర్ల బరువుతో సమానం. అయితే ఫాల్కన్ హెవీ కంటే శాటర్న్ వీ రాకెట్ అత్యధిక బరువును మోసుకెళ్లగలదు. ప్రసుతానికై తే అంతరిక్ష రంగంలో ఫాల్కన్ హెవీ ప్రయోగం అతిపెద్దది. తొలుత ఫాల్కన్ హెవీని చంద్రుడు, అంగారకుడిపైకి మనుషులను పంపాలన్న ఉద్దేశంతో ప్రారంభించామని, అయితే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించుకున్నామని ఎలన్ మస్క్ చెప్పారు. దీని ద్వారా సుదూర అంతరిక్ష ప్రాంతాలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
న్యూ హారిజాన్‌స స్పేస్ క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర
నాసాకు చెందిన న్యూ హారిజాన్‌స స్పేస్‌క్రాఫ్ట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ సాధించని రికార్డును తన పేరిట నమోదుచేసింది. సౌరకుటుంబంలో చివరిగా ఉంటూ.. కొన్నేళ్ల కిందట గ్రహం హోదా కోల్పోయిన ప్లూటో గురించి ఇప్పటికే ఎంతో సమాచారం అందించిన ఘనత ఈ న్యూ హారిజాన్‌స సొంతం. కాగా తాజాగా భూమికి సుదూరాన ఉన్న నక్షత్ర మండలి ఫొటోలను తీసి కొత్త రికార్డు సృష్టించింది. భూమికి 1,300 కాంతి సంవత్సరాల దూరంలో క్యూపర్ బెల్ట్‌లోని నక్షత్ర సమూహానికి చెందిన అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను న్యూ హారిజాన్‌స తీసింది. ఆ సయమంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి 612 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. తన అత్యాధునిక లాంగ్ రేంజ్ రీకానిసెన్‌స ఇమేజర్ కెమెరాను ఆన్ చేసి ఈ అద్భుత చిత్రాలను తీసింది. ఈ క్రమంలో గతంలో నాసాకే చెందిన వోయేజర్స్ 1 రికార్డును కూడా బీట్ చేసింది. వోయెజర్స్ స్పేస్‌క్రాఫ్ట్ అత్యధికంగా 606 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లి ఫొటోలు తీసింది. ఇప్పుడు న్యూ హారిజాన్‌స ఆ దూరాన్ని దాటి ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ రోజుకు 11 లక్షల కిలోమీటర్ల వేగంతో విశ్వంలో దూసుకెళ్తోంది.
కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్
పాకిస్తాన్ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్‌స చీఫ్ ఫిబ్రవరి 13న హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డెరైక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్‌స డ్యాన్ కోట్స్ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా పాక్ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు.
దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం
భారత అటవీ నివేదిక- 2017ను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్థన్ ఫిబ్రవరి 12న విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం 2015-17 మధ్యకాలంలో భారత అటవీ విస్తీర్ణం 0.21 శాతం మేర పెరిగింది. దేశం మొత్తం అటవీ విస్తీర్ణం 7,08,273 చ.కి.మీ.గా ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.53 శాతం వాటాను కలిగి ఉంది.
ల్యాబ్‌లో మానవ అండాల అభివృద్ధి
బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ అండాలను ప్రయోగశాలలో విజయవంతంగా పెంచారు. ఇవి మానవ అండాల అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని లండన్‌లో ఫిబ్రవరి 9న వెల్లడించారు. కాగా, ఎలుకల అండాలను దాదాపు 20 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. పరిశోధనల్లో భాగంగా 25-40 ఏళ్ల వయసు కలిగిన 10 మంది మహిళల నుంచి అండాశయ కణజాలాన్ని సేకరించారు.
కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ జనవరి 31న కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు.
పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. జనవరి 31న ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.
స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి కరంజ్ జలప్రవేశం
భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా జనవరి 31న ముంబైలో ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్‌ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ కరంజ్‌గా నామకరణం చేశారు.
చెన్నైలో కృత్రిమ చెవి తయారీ
దేశంలోనే ప్రప్రథమంగా చెన్నై సైన్స్ ల్యాబ్‌లో వైద్యులు కృత్రిమ చెవిని రూపొందించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు సిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చెవి నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, సిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా దీనిని రూపొందించింది. చెవులు కోల్పోయిన వారి కోసం వారి దేహంలోని ఒక ప్రదేశంలో కణాలను తీసుకొని ల్యాబ్‌లో కృత్రిమ చెవులను తయారు చేస్తున్నారు.
అగ్ని-1 పరీక్ష విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి 2004లోనే సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా దీనిని పరీక్షించారు. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 క్షిపణిలో ఉందని అధికారులు తెలిపారు. రేంజ్, అక్యూరెసీలో అగ్ని -1 అత్యద్భుత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయి్య కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 క్షిపణిని 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు.
అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతం
జపాన్ అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకె ట్(ఎస్‌ఎస్-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్-520 పొడవు 10 మీటర్లు కాగా, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది.
విహరించిన తేలికపాటి హెలికాప్టర్
భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్‌సీహెచ్-టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.

No comments:
Post a Comment