జీవ గ్రహాల అన్వేషణకు వ్యోమనౌక
సౌరకుటుంబం వెలుపల గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించేందుకు అనువుగా ఉన్న గ్రహాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా వ్యోమనౌకను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 19న వ్యోమనౌకను ప్రయోగించారు.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతంభారత్‌కు సొంత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 43వ ఉపగ్రహం అయిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ (రీప్లేస్‌మెంట్) బరువు 1,425 కిలోలు. ఇందులో ఎల్5, ఎస్‌బ్యాండ్ నావిగేషన్ సాధనాలు, రుబీడియరం పరమాణు గడియారాలు, సీబ్యాండ్ రేంజింగ్ పేలోడ్, లేజర్ రేంజింగ్ కోసం కార్నర్ క్యూబ్ రెట్రో రెఫ్లెక్టర్లున్నాయి. దీని పరిమాణం 1.58 మీ. × 1.5 మీ. × 1.5 మీ. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.
ప్రయోగం జరిగిందిలా..
321 టన్నుల బరువు, 44.4 మీటర్ల పొడవున్న సీ41 రాకెట్ ప్రయోగంను మొత్తం నాలుగు దశల్లో ఆరు ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సహాయంతో చేపట్టారు. మొదటిదశలో స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఘన ఇంధనం సహాయంతో 110 సెకన్లలో మొదటి దశను పూర్తిచేశారు. ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 263 సెకండ్లకు రెండో దశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 598 సెకండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1122 సెకండ్లకు నాలుగోదశ పూర్తయింది. ఈ ఉపగ్రహాన్ని పెరీజీ (భూమిగా దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 20,650 కిలోమీటర్ల ఎత్తులో భూ బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 827 కిలోల ద్రవ ఇంధనాన్ని దశల వారీగా మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిరకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
నావిక్ దిక్సూచీ వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం. ఇందులో మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను 2013 జులై 1న కక్ష్యలోకి పంపారు. ఇందులో సమయాన్ని నిర్ధరించడానికి ఏర్పాటు చేసిన మూడు రుబీడియం గడియారాలు విఫలమయ్యాయి. దాని స్థానంలో 2017 ఆగస్టు 31న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహంను ప్రయోగించారు. ఉష్ణకవచాలు తెరుచుకోకపోవడంతో ప్రయోగం చివరి దశలో ఇది కూడా విఫలమైంది. దీంతో తాజాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఐను ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ సిరీస్‌లో కొన్ని ఉపగ్రహాలు భూస్థిర కక్ష్య (జీఈవో) లో మరికొన్ని భూఅనువర్తిత కక్ష్య (జీఎస్‌వో)లో పరిభ్రమిస్తాయి.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపయోగాలు
సూర్యుడి వద్దకు తెలంగాణ విద్యార్థుల పేర్లు
సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా సూర్యుడి వద్దకు తమ పేర్లను పంపే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిన్నారం మండలం బొల్లారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఫణిధర్, నరేశ్, ఉదయ్, గౌతమి, అనితలకు ఈ అవకాశం దక్కింది.
సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి సూర్యుడికి అతిదగ్గరగా అధ్యయనం చేసేందుకు నాసా మే నెలలో ‘పార్కర్ పోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్’ అనే యంత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ యంత్రంలో ఉండే మెమొరీ కార్డులో పేర్లను నిక్షిప్తం చేసి పంపడానికి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరింది. ఇందుకోసం దరఖాస్తు చేసిన తమ పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్‌రెడ్డి తెలిపారు.
భూస్థిర కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ
నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని భూ స్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు నాలుగు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న రోదసిలోకి పంపారు.
హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్ ప్రారంభం
భారతదేశ తొలి హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 10న బిహార్‌లోని మోతిహరీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్‌స్టోమ్ సంయుక్తంగా 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం గల రైలు ఇంజన్‌ను తయారుచేశాయి. వచ్చే 11 ఏళ్లలో మరో 800 రైలు ఇంజన్లను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
సైబర్ నేరాలకు కొత్త అస్త్రం క్రిప్టోజాకింగ్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు కొత్త పద్ధతులు వినియోగిస్తున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్ తెలిపింది. సంప్రదాయ సైబర్ నేరాలతో సంపాదన తగ్గిపోతుండటంతో కొత్త పద్ధతుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ (ఐఎస్‌టీఆర్) పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ విధానంలో క్రిప్టోకరెన్సీ (బిట్‌కాయిన్) లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైందని తెలిపింది.

- నింగి, నేల, నీటిలో కూడా నావిగేషన్ సేవలు అందిస్తుంది.
- సైనికులకు ఖచ్చితత్వంతో కూడిన సమయాన్ని చూపిస్తుంది.
- మత్స్యకారులు, విపత్తు నిర్వహణ సేవలను అందిస్తుంది.
- వాహనాల గమనం, మొబైల్ ఫోన్లతో వాహనాల అనుసంధానం
- మ్యాపింగ్ వంటి తదితర సేవలు కూడా పొందవచ్చు.
నావిక్ లేదా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ అంటే?
అమెరికా ప్రవేశపెట్టిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) తరహాలో భారత్‌కు సొంత దిక్సూచి (నావిగేషన్) వ్యవస్థ ఉండాలని ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని వల్ల భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల మేర నిర్ధిష్ట సమయం, పొజిషన్, నావిగేషన్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2,246 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి గ్లోబల్ ఇండియన్ నావిగేషనల్ సిస్టమ్ (జీఐఎన్‌ఎస్)ను ఇస్రో చేపట్టనుంది.
దేశాలు - దిక్సూచీ వ్యవస్థలు

దేశాలు
|
దిక్సూచీ వ్యవస్థలు
|
అమెరికా
|
జీపీఎస్
|
రష్యా
|
గ్లోనాస్
|
యూరప్
|
గెలీలియో
|
భారత్
|
నావిక్
|
సూర్యుడి వద్దకు తెలంగాణ విద్యార్థుల పేర్లు
సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా సూర్యుడి వద్దకు తమ పేర్లను పంపే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిన్నారం మండలం బొల్లారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఫణిధర్, నరేశ్, ఉదయ్, గౌతమి, అనితలకు ఈ అవకాశం దక్కింది.
సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి సూర్యుడికి అతిదగ్గరగా అధ్యయనం చేసేందుకు నాసా మే నెలలో ‘పార్కర్ పోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్’ అనే యంత్రాన్ని అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ యంత్రంలో ఉండే మెమొరీ కార్డులో పేర్లను నిక్షిప్తం చేసి పంపడానికి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరింది. ఇందుకోసం దరఖాస్తు చేసిన తమ పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్‌రెడ్డి తెలిపారు.
భూస్థిర కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ
నావిగేషన్ శాటిలైట్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని భూ స్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. బెంగళూరులోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు నాలుగు విడతలుగా కక్ష్యదూరాన్ని పెంచి ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 35,462 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,737 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఏప్రిల్ 12న రోదసిలోకి పంపారు.
హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్ ప్రారంభం
భారతదేశ తొలి హైస్పీడ్ ఎలక్ట్రికల్ రైలు ఇంజన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 10న బిహార్‌లోని మోతిహరీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్‌స్టోమ్ సంయుక్తంగా 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం గల రైలు ఇంజన్‌ను తయారుచేశాయి. వచ్చే 11 ఏళ్లలో మరో 800 రైలు ఇంజన్లను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
సైబర్ నేరాలకు కొత్త అస్త్రం క్రిప్టోజాకింగ్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు కొత్త పద్ధతులు వినియోగిస్తున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్ తెలిపింది. సంప్రదాయ సైబర్ నేరాలతో సంపాదన తగ్గిపోతుండటంతో కొత్త పద్ధతుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్ (ఐఎస్‌టీఆర్) పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ విధానంలో క్రిప్టోకరెన్సీ (బిట్‌కాయిన్) లావాదేవీలు నిర్వహించే వారినే లక్ష్యంగా చేసుకొని వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైందని తెలిపింది.
క్రిప్టోజాకింగ్ అంటే?
మొబైల్, పీసీ, ట్యాబ్లెట్ లేదా ఇంటర్నెట్ ఆధారిత(ఐఓటీ) పరికరాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని హైజాక్ చేయడాన్ని క్రిప్టోజాకింగ్ అంటారు. ఫలితంగా కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు నెట్‌వర్క్ మొత్తం సమస్యలకు గురవుతుంది. దీనిని వాడుకొని హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని పొందుతారు.
జీశాట్-6ఏ ప్రయోగం విజయవంతంభారత సమాచార వ్యవస్థకు మరింత సాంకేతికతను జోడించేందుకు మార్చి 29న ప్రయోగించిన జీశాట్6-ఏ విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 వాహకనౌక, 2,140 కిలోలు బరువు కలిగిన జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో క్రయోజనిక్ దశ (పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు) ద్వారా చేసిన ప్రయోగాల్లో వరుసగా ఆరోవిజయాన్ని ఇస్రో నమోదు చేసింది. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేసిన 12 ప్రయోగాల్లో ఇది తొమ్మిదో విజయం. షార్‌నుంచి 63వ ప్రయోగం.

ప్రయోగం జరిగిందిలా..49.1 మీటర్ల పొడవు, 415.6 టన్నులున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 మొదటి దశలో 4 స్ట్రాపాన్ బూస్టర్లు, కోర్ అలోన్ ఉన్నాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 42.7 టన్నుల ద్రవ ఇంధనం లెక్కన నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.8 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో 138.11 ఘన ఇంధనంతో 151 సెకన్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. 39.48 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 285 సెకన్లలో రెండోదశను, ఆ తరువాత మూడో దశ (క్రయోజనిక్ దశ) ను 12.84 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1,065 సెకన్లలో పూర్తి చేసింది. మొత్తం 25 నిమిషాల పాటు ప్రయాణించి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్ష్య అయిన పెరిజీ 170 కిలోమీటర్లు, సుదూర కక్ష్య అయిన అపోజీ 35,975 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెట్టింది. అనంతరం హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ వారు ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకున్నారు.
జీశాట్ 6ఏ ప్రయోజనాలుజీశాట్-6ఏ సమాచార ఉపగ్రహ ప్రయోగంతో డిజిటల్ మల్టీ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. జీశాట్ 6ఏ ఉపగ్రహంలో 5ఎస్ బ్యాండ్ స్పాట్ బీమ్స్, ఒక సీబ్యాండ్ బీమ్ అమర్చారు. ఆరు చదరపు మీటర్లు వ్యాసార్థం కలిగిన అన్‌ఫర్‌లేబిల్ యాంటెన్నాతో యూజర్ కమ్యూనికేషన్ లింక్, 0.8 చదరపు మీటర్లు ఫిక్స్‌డ్ యాంటెన్నా ద్వారా హబ్ కమ్యూనికేషన్ లింక్ అందుబాబులోకి వస్తుంది. ఇందులోని భారీ యాంటెన్నా భారతదేశమంతా పూర్తిస్థాయిలో విస్తరిస్తూ అయిదు పుంజాలతో పనిచేస్తుంది. సాధారణంగా ఇస్రో రూపొందించే ఆంటెన్నా కంటే ఇది మూడు రెట్లు పెద్దది.
ఎస్ బ్యాండ్ అంటేఎస్ బ్యాండ్ అనేది విద్యుదయాస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం. 2 నుంచి 4 గిగా హెర్ట్జ్ పౌనపున్యాల మధ్య నడిచే ఈ బ్యాండ్ వాతావరణానికి సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో వాడుతున్నారు. 2.5 జీహెచ్‌జెడ్‌ను ప్రపంచవ్యాప్తంగా 4జీ సేవలకు వినియోగిస్తున్నారు.
జీశాట్-6ఏ కక్ష్య దూరం పెంపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్08 ద్వారా మార్చి 29 న ప్రయోగించిన జీశాట్ 6ఏ ఉపగ్రహ మొదటి విడత కక్ష్య దూరాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పొడిగించారు. ఈ రాకెట్ ద్వారా జీశాట్ 6ఏ ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 170 కిలోమీటర్లు, అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పెరిజీని 36 వేల కిలోమీటర్ల ఎత్తుకు పెంచే ప్రక్రియను దశల వారీగా చేపడుతున్నారు.
భూమిపై కూలిపోనున్న చైనా అంతరిక్ష కేంద్రం
చైనాకు చెందిన అంతరిక్ష కేంద్రం నిరుపయోగంగా మారి, నియంత్రణ కోల్పోవడంతో త్వరలోనే భూమిపై కూలిపోనుంది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఏప్రిల్ 2న ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
టియాంగంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్-1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్‌డ స్పేస్ ఏజెన్సీ చెప్పింది.
'జీశాట్-6ఏ’ తో తెగిపోయిన సంబంధాలుదేశ సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టిన జీశాట్-6ఏ ఉపగ్రహంతో బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ)తో సంబంధాలు తెగిపోయాయి. ఉపగ్రహ కక్ష్య దూరాన్ని పెంచే క్రమంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో ప్రకటించింది.
మార్చి 30, 31 తేదీల్లో మొదటి, రెండో విడత ఉపగ్రహ కక్ష్య దూరాన్ని ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి విజయవంతంగా పొడిగించారు. ఏప్రిల్ 2న మూడో విడత కక్ష్య దూరం పెంపులో భాగంగా ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి సిగ్నల్స్ ఆగిపోయాయి.
పసిఫిక్ మహాసముద్రంలో కూలిన టియాంగంగ్
చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్-1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఏప్రిల్ 1న ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్-1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎవ్వరికీ హాని జరగలేదనీ, నియంత్రణ కోల్పోయిన స్కైలాబ్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్‌డ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది.
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్-1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ దీని సేవలను చైనా పొడిగించింది. 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది.
సుదూర నక్షత్రాన్ని గుర్తించిన నాసా
విశ్వంలోని అనంత దూరంలో అతి పెద్దదైన నీలం రంగు నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించినట్లు నాసా ఏప్రిల్ 3న ప్రకటించింది. ఈ నక్షత్రానికి ఇకరస్‌గా నామకరణం చేసింది. భూమి నుంచి 9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్ర మండలంలో దీనిని గుర్తించారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ ఆధారంగా ఈ నక్షత్రాన్ని పెద్దదిగా చేసి కాంతిని పరిశీలించారు.
విశ్వంలో పెద్ద సమూహాల నక్షత్ర మండలాల గురుత్వాక్షరణ శక్తి సాధారణ లెన్‌సగా పని చేసినప్పుడు కాంతిని వంచడం వల్ల గురుత్వాక్షరణ లెన్సింగ్ ఏర్పడుతుంది. ఈ గురుత్వాక్షరణ శక్తితో పాటు హబుల్ టెలిస్కోప్ సామర్థ్యాన్ని కలిపి ఈ నక్షత్రాన్ని అధ్యయనం చేశారు.
ఖండాంతర క్షిపణి సర్మత్‌ను పరీక్షించిన రష్యా
అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) సర్మత్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా సైన్యం మార్చి 30న ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరొందిన వొయేవోడా(సాతాన్) స్థానంలో సర్మత్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని బరువు 200 టన్నులు.

No comments:
Post a Comment