సుఖోయ్ నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
వాయు సేనలో సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని నవంబర్ 22న యుద్ధ విమానం సుఖోయ్-30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది. బ్రోహ్మోస్ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. బ్రహ్మోస్, సుఖోయ్-30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. ఎక్కడి నుంచైనా ప్రయోగం..భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. బ్రహ్మోస్. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ-700 ఒనిక్ సూపర్‌సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)-రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు. బ్రహ్మోస్ ప్రత్యేకతలు..
ఉమంగ్ యాప్‌ను ప్రారంభించిన ప్రధానిఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపై పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను కేంద్రం తెచ్చింది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థల్లో 1,200 రకాల సేవలను దీని ద్వారా పొందొచ్చని అధికారులు చెప్పారు. ఈ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులు సులభంగా చేయొచ్చు. అంతేకాకుండా ఆధార్, డిజిలాకర్, భారత్ బిల్ పేమేంట్, ఈపీఎఫ్‌వో, కొత్త పాన్‌కు దరఖాస్తు తదితర సేవలనూ పొందొచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ తెలుగుతో పాటు 12 భారతీయ భాషల్లో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ద్వారా మాత్రమే పనిచేసే ఈ యాప్.. ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్‌ఫోన్‌లోనూ త్వరలో అందుబాటులోకి రానుంది. న్యూజిలాండ్‌లో తొలి వర్చువల్ రాజకీయ నేత ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. అటకామా ఎడారిలో హెచ్‌ఐవీకి మందుభూమ్మీద అత్యంత ఎత్తయిన, పొడి వాతావరణం కలిగిన అటకామా ఎడారి (చిలీ) లో ఎయిడ్‌స చికిత్సలో ఉపయోగపడే సూక్ష్మజీవులను కనుగొన్నట్లు బ్రిటన్‌లోని న్యూకాస్టిల్ వర్సిటీ పరిశోధకులు గుడ్‌ఫెల్లో చెప్పారు. సముద్ర మట్టానికి 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తు గల ప్రాంతం నుంచి సేకరించిన మట్టిలో ఈ సూక్ష్మజీవులున్నాయని తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో కీలకమైన యాక్టినోబ్యాక్టీరియా జాతి హెచ్‌ఐవీ వైరస్‌ను పునరుత్పత్తి చేసే ఎంజైమ్‌ను నిరోధించడంలో సహకరిస్తుందని వివరించారు. రక్తకణం సైజులో రోబోల తయారీరక్తకణాల సైజులో ఉండే రోబోలను తయారుచేశామని హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోబోలు శరీరంలోని చిన్న చిన్న అవయవభాగాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న సమస్యను నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉన్న శైవలాలతో రూపొందించిన ఈ రోబోల లోపలి పొరల్లో అయస్కాంతాన్ని పూతగా పూశారు. దీంతో రోబో మన శరీరంలో ఎక్కడ ఉన్నా.. చర్మంపై నుంచి స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీటిని ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించగా.. అవి రక్తం, జీర్ణరసాలలో అనుకున్న సమయానికే కరిగిపోయాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మత్స్య సంపదను గుర్తించే ‘సముద్ర’ పరిశోధన కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో కలిసి సముద్ర జలాల్లో పెద్దఎత్తున చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించే ‘సముద్ర’ ప్రాజెక్టును ప్రారంభించింది. సముద్రంలో మార్పులను విశ్లేషిస్తూ, మత్స్య సంపద లభ్యతపై అంచనాలు రూపొందించే ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ డెరైక్టర్ ఎ.గోపాల కృష్ణన్ తెలిపారు. వరద ముప్పును గుర్తించే పరికరం అభివృద్ధి భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు. మంచు పలకలతో ముంబై, మంగళూరులకు ముప్పునానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది. గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్’ అనే పరికరం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. అణు జలాంతర్గామి అరిధామన్ ప్రవేశంభారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. భారత అణు జలాంతర్గాముల శ్రేణిలో తొలి న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిహంత్ 2009 జూలై 26న ప్రారంభమైంది. 2016 అక్టోబర్ నుంచి ఇది నావికాదళంలో చేరి సేవలందిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత అదే శ్రేణిలోని రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్ నవంబర్ 19న విశాఖలోని నేవల్ డాక్ యార్డులో జలప్రవేశం చేసింది. ఆరో దేశం.. భారత్ ఇప్పటివరకూ ప్రపంచంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాత్రమే అణు జలాంతర్గాములను కలిగి ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్‌తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కలిగిన ఆరో దేశంగా భారత్ చేరింది. అడ్వాన్‌సడ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్టు కింద మొత్తం ఐదు అణు జలాంతర్గాములను నావికా దళం కోసం భారత్ నిర్మించతలపెట్టింది. ఇందులో మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్, రెండోది అరిధామన్. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ ఐదు అణు జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్ అరిహంత్‌కంటే అరిధామన్ రెట్టింపు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అరిధామన్ సముద్ర సన్నాహాలు, ఇతర అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకుని నేవీలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇదీ సామర్థ్యం.. బరువు : 6,000 టన్నులు టెస్ట్ డెప్త్ : 400 మీటర్ల వరకు వేగం : గంటకు సముద్ర ఉపరితలంపై 12 - 15 నాటికల్ మైళ్లు, నీటి అడుగున 24 నాటికల్ మైళ్లు ఆయుధాలు : 750 - 1900 కి.మీల లక్ష్యాన్ని ఛేదించే కె - 15 ఎస్‌ఎల్‌బీఎం అణు క్షిపణులు - 24. కె- 4 ఎస్‌ఎల్‌బీఎం క్షిపణులు 8 ( 3,500 కీ.మీ.ల పరిధి) టార్పెడోలు : 21 అడుగుల పొడవుండే టార్పెడోలు - 6 2018లో చైనా అమ్ముల పొదిలోకి డాంగ్‌ఫెంగ్ -41 ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకేలా.. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా అమ్ముల పొదిలోకి చేరనుంది. డాంగ్‌ఫెంగ్ -41గా పిలుస్తున్న ఈ కొత్త క్షిపణి.. మాక్ 10 కంటే వేగంతో దూసుకుపోగలదు. ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా ఈ ఖండాంతర క్షిపణి సొంతమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 2012లో ప్రకటించిన ఈ క్షిపణిని ఇంతవరకూ ఏడు సార్లు పరీక్షించగా.. తాజాగా మరోసారి నవంబర్ మొదటి వారంలో పరీక్షించినట్లు సమాచారం. 2018 ప్రథమార్ధానికి ఈ అత్యాధునిక క్షిపణి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందుబాటులోకి రానుంది. 12 వేల కి.మి. దూరంలో లక్ష్యాల్ని ఛేదించే డాంగ్‌ఫెంగ్-41లో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ‘స్పైక్ క్షిపణుల’ ఉపసంహరణకు భారత్ నిర్ణయం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్ యాంటి ట్యాంక్ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్‌సడ్ డిఫెన్‌స సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్ స్పైక్ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశం : నాసాఅపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల 2036లో భారీ విధ్వంసం జరగొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఢీకొట్టడం వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తోంది. అపోఫిస్ అనే గ్రహశకలాన్ని 2004లో నాసా తొలిసారిగా గుర్తించింది. దీని పరిమాణం దాదాపుగా రెండున్నర ఫుట్‌బాల్ మైదానాలంత ఉంటుందని అంచనా. అప్పటి నుంచి దాని కదలికలను నిశితంగా గమనిస్తోంది. 2036లో అపోఫిస్ భూమిని ఢీకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నాసా వర్గాలు పేర్కొన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే 2036 ఏప్రిల్ 13 మన భూగ్రహానికి చివరిరోజు కావొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2029లో కూడా అపోఫిస్ గ్రహశకలం భూమికి సమీపంలో, 32 వేల కిలోమీటర్ల దూరంలోనే వెళ్లొచ్చనీ, అప్పుడు దాని మార్గంలో ఏ చిన్న తేడా వచ్చినా, భూమిపై పెను విధ్వంసం జరగొచ్చని రష్యా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌక ప్రపంచంలోనే తొలి పూర్తి స్థాయి విద్యుత్ నౌకను దక్షిణ చైనాలోని గువాంగ్‌డన్ ప్రావిన్స్‌లో నవంబర్ 13న ప్రారంభించారు. దీని బరువు 600 టన్నులు, పొడవు 70.5 మీటర్లు. 26 టన్నుల లిథియం బ్యాటరీతో నడిచే ఈ నౌకకు రెండు గంటలు చార్జింగ్ పెడితే 2 వేల టన్నుల సరకును 80 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. గంటకు గరిష్టంగా 12.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో శిలాజ ఇంధనాలు ఉపయోగించరు. అందువల్ల దీని నుంచి హానికర ఉద్గారాలు వెలువడవు. మొబైల్ గేమింగ్‌లో మూడోస్థానంలో భారత్ మొబైల్ గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. బ్రెజిల్, రష్యాలు భారత్‌కంటే ముందు వరుసలో నిలిచాయి. హైదరాబాద్‌కు చెందిన గేమింగ్ క్రియేటర్ యూనిటీ టెక్నాలజీస్ నవంబర్ 9న ఈ విషయాన్ని వెల్లడించింది. సరిగ్గా పదినెలల కిందటి గణాంకాల ప్రకారం గేమ్స్ ఇన్‌స్టాలేషన్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. కేవలం 300 రోజుల వ్యవధిలోనే మూడోస్థానానికి ఎగబాకడం గమనార్హం. అయితే మొదటి రెండుస్థానాల్లో అప్పుడూ, ఇప్పుడూ బ్రెజిల్, రష్యాలే ఉన్నాయి. ట్వీటర్‌లో డిస్‌ప్లే నేమ్ ‘పరిమితి’ పెంపు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా నవంబర్ 11 నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది. భారీ గ్రహంను గుర్తించిన బ్రిటన్ శాస్త్రవేత్తలుఒక చిన్న నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న భారీ గ్రహాన్ని బ్రిటన్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుగ్రహం పరిమాణంలో ఉన్న ఈ గ్రహానికి ఎన్జీటీఎస్-1బీ అని నామకరణం చేశారు. నక్షత్రం, గ్రహం పరిమాణాల నిష్పత్తి, వాటి మధ్య దూరం ఆధారంగా చిన్న నక్షత్ర మండలాల చుట్టూ భారీ గ్రహాలు ఏర్పడవని చెబుతున్న అనేక సిద్ధాంతాలకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూమి, సూర్యుడి మధ్య దూరంతో పోల్చితే ఈ నక్షత్రానికి, ఎన్జీటీఎస్-1బీ మధ్య ఉన్న దూరం కేవలం మూడు శాతమే. 2.6 రోజుల్లో తన పరిభ్రమణాన్ని పూర్తి చేసే ఈ గ్రహం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా చాలా అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నిర్భయ్ పరీక్ష విజయవంతంస్వదేశంలో తయారైన అణ్వాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందిపూర్ ఐటీఆర్ కేంద్రం నుంచి నవంబర్ 7న ఈ పరీక్ష నిర్వహించింది. 2013 నుంచి ఇప్పటి వరకు జరిపిన నాలుగు పరీక్షల్లో నిర్భయ్ విఫలమైంది. భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్‌సోనిక్ క్షిపణి(ఎల్‌ఏసీఎం) 300 కిలోల బరువు గల అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రత్యర్థుల రాడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ప్రయాణం చేసేలా డీఆర్‌డీఓ దీన్ని రూపొందించింది. గ్లెడ్ బాంబు పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి గ్లెడ్ బాంబును రక్షణ శాఖ నవంబర్ 2న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం (ఐటీఆర్) వద్ద వాయు సేన విమానం నుంచి దీన్ని జారవిడిచింది. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ బాంబును ఇమారత్ పరిశోధన కేంద్రం(ఆర్‌సీఐ), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), వాయు సేన సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. శత్రు వైమానిక స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. |
Friday, 1 December 2017
నవంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ
అక్టోబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ
2018 మార్చిలో చంద్రయాన్-2 ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూన్ మిషన్.. చంద్రయాన్-2పై కేంద్ర అంతరిక్ష, అణు, ఇంధనశాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం 2018 మార్చిలో ఉంటుందని ప్రకటించారు. జీఎస్‌ఎల్వీ ఎంకే-2 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరుగుతుంది.
ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని ఉపరితలంపై సంచరించగల ఒక మోటార్ జెడ్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఒక రోవర్ చంద్రుడిపై చక్రాలతో నడుస్తూ మృత్తిక, రాళ్ళ నమూనాలను సేకరించి వాటి రసాయన విశ్లేషణలను జరిపి, చంద్రుడి చుట్టూ ఎత్తయిన కక్ష్యలో పరిభ్రమించే చంద్రయాన్-2కు అందిస్తుంది. చంద్రయాన్-2 నుంచి సమాచారం గ్రౌండ్‌స్టేషన్‌లోని యాంటెనా అందుకుంటుంది. 2020 కల్లా చంద్రుడిపైకి ఒక మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని కూడా ఇస్రో భావిస్తోంది.
చైనాలో తొలి హైడ్రోజన్ ట్రామ్ ప్రారంభంప్రపంచంలోనే తొలి పర్యావరణహిత, హైడ్రోజన్‌తో నడిచే ట్రామ్‌ను చైనా అక్టోబర్ 27న ప్రారంభించింది. దీని ద్వారా నార్త్ చైనాలోని హెబీ ప్రావిన్‌సలోని తంగ్షన్‌లో కమర్షియల్ సర్వీసులను అందించనున్నారు. మూడు బోగీలతో కూడిన ట్రామ్‌లో మొత్తం 66 సీట్లు ఉంటాయి. 12 కేజీల హైడ్రోజన్‌ను ఒకసారి నింపుకోగల సామర్థ్యమున్న ట్రామ్ గంటకు నలభై నుంచి 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
‘డెత్ జోన్’లోకి వెళ్లే డ్రోన్లను పరీక్షించిన చైనాఎక్కువ ఎత్తుకు వెళ్లే గూఢచార డ్రోన్‌ను చైనా విజయవంతంగా పరీక్షించింది. క్రికెట్ బ్యాట్ సైజులో ఉండే ఈ డ్రోన్ రక్షణ రంగంలో ఎంతగానో సహాయపడనుంది. సముద్రమట్టానికి 20 కిలోమీటర్ల ఎత్తు పైనుంచి అంతరిక్ష సమీప ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ గాలి పలుచగా ఉండటం, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ఆ జోన్‌ను డ్రోన్లకు ‘డెత్ జోన్’గా పరిగణించేవారు. తక్కువ గాలి ఉండటంతో అక్కడ డ్రోన్ ఎగరడం సాధ్యం కాదు. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డ్రోన్‌లోని బ్యాటరీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విఫలమయ్యే ప్రమాదముంది. అయితే చైనా తయారు చేసిన ఈ డ్రోన్ ఆ పరిస్థితులను తట్టుకుంటుంది.
రోబోలకు అనువైన ‘చర్మం’మనుషుల రోజువారీ పనులను చేసేందుకుగాను రోబోలకు దానికనుగుణంగా ఉండే చర్మాన్ని పరిశోధకులు రూపొందించారు. ఈ చర్మాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ (యూడబ్ల్యూ)కి చెందిన 45 మంది ప్రొఫెసర్లు తయారు చేసినట్లు యూడబ్ల్యూ ప్రొఫెసర్ జోనాథన్ పోస్నర్ తెలిపారు. ఈ చర్మాన్ని తొడిగిన రోబోలు మనుషుల రోజువారీ పనులను తేలికగా, ఆటంకాలు లేకుండా చేసేస్తాయని చెప్పారు. వస్తువుల స్వభావాలను బట్టి ఈ చర్మం రోబోలకు సంకేతాలు అందిస్తుందని, దానికి తగ్గట్లుగా రోబో పనిచేస్తుందని పోస్నర్ తెలిపారు. ఈ చర్మం అక్టోబర్ నెలాఖరు నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
అంతరిక్ష కేంద్రంలో ‘అలమర’అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్‌టీవీ-7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది.
95% ప్లాస్టిక్ వ్యర్థాలకు పది నదులే కారణం ప్రపంచ వ్యాప్తంగా కేవలం పది నదుల ద్వారానే 88-95 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని తేలింది. ఈ జాబితాలో గంగా, సింధు సహా 8 నదులు ఆసియాలో ఉండగా, మరో రెండు నదులు ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తున్నాయి. సరైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు పాటించకపోవడంతో ఏటా 5 ట్రిలియన్ పౌండ్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త డా.క్రిస్టియన్ ష్మిత్ తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా 57 నదుల్లో, 79 చోట్ల నమూనాలు సేకరించామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్‌స, వియత్నాం, శ్రీలంకల వాటాయే 50 శాతానికిపైగా ఉంటుందన్నారు.
వ్యర్థాలను చేరవేస్తున్న తొలి 10 నదులు: యాంగ్జీ, సింధు, యెల్లో రివర్, హైహీ (ఆసియా); నైలు (ఆఫ్రికా); గంగా, పెరల్, అముర్ (ఆసియా); నైజర్ (ఆఫ్రికా), మెకాంగ్ (ఆసియా).
భూమికి సమీపంగా ‘2012 టీసీ4’ ఉల్క శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగానే ‘2012 టీసీ4’ ఉల్క భూమికి సమీపంగా దూసుకెళ్లింది. అంటార్కిటికా మీదుగా అక్టోబర్ 12న ఈ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అమెరికాలోని హవాయి హలియకల అబ్జర్వేటరీలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ ద్వారా ‘2012 టీసీ4’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత ఈ శకలం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అదృశ్యమైంది. మళ్లీ ఈ ఏడాది జూలైలో చంద్రుని కక్ష్యలో కనిపించింది.
భూమికి ఎంత దగ్గరగా..యాభై నుంచి వంద అడుగుల పరిమాణంలో ఉన్న ఈ శకలం గంటకు దాదాపు 16,000 మైళ్ల వేగంతో అంటే సెకనుకు 4.5 మైళ్ల వేగంతో అంటార్కిటికాకు 27 వేల మైళ్ల ఎత్తు నుంచి దూసుకెళ్లింది. ఇది ఎంతో దూరంలో ఉంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతరిక్ష ప్రమాణాల ప్రకారం భూమి-చంద్రుడి మధ్యలో ఎనిమిదో వంతు దూరంలోనే ఉన్నట్లుగా భావించాలి.
ఎదుర్కోగలమా ? భూమిపై పడే ఉల్క లేదా గ్రహ శకలాన్ని ఉపగ్రహంతో పేల్చేసే సామర్థ్యం మనకుంది. 2004లో ‘డీప్ ఇంపాక్ట్’ మిషన్ సందర్భంగా నాసా అదే చేసింది. ఇటువంటి ఉల్కలను గురి చూసి కొట్టడం కొంత కష్టం. పెద్ద పరిమాణంలో ఉన్న శకలాన్ని గుర్తించడంతో పాటు సరిగ్గా మధ్యలో రాకెట్‌తో ఢీకొట్టించడమన్నది కొంతమేర సవాలుగా నిలిచినప్పటికీ, 100 నుంచి 200 మీటర్ల వైశాల్యమున్న శకలాల్ని మాత్రం పేల్చేసేందుకు అంతరిక్ష సంస్థలు సిద్ధంగానే ఉన్నాయని శాస్త్రవేత్త డెట్‌లెఫ్ చెప్పారు.
ఒంగోలు జాతి వృద్ధి కోసం టెస్ట్‌ట్యూబ్ విధానంఒంగోలు జాతి ఆవుల సంతతిని పెంచేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం పిండ మార్పిడి ప్రక్రియ(ఐవీఎఫ్) ద్వారా టెస్ట్ ట్యూబ్ దూడలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకుగానూ దేశవ్యాప్తంగా 15 లేబొరేటరీలను ఎంపిక చేయగా.. అందులో గుంటూరు జిల్లా లాం ఫాంలోని పిండోత్పత్తి జీవసాంకేతిక ప్రయోగశాల కూడా చోటు దక్కించుకుంది.
ఐవీఎఫ్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. రాష్ట్రంలో 2.5 లక్షల వరకు ఆవులుంటాయని అంచనా. వీటిలో అనుకూలమైన వాటిని ఎంపిక చేసి, సమాచారం అందిస్తే.. పిండ మార్పిడి చేస్తారు.
ఒంగోలు జాతి సంరక్షణ ఎందుకు?ఒంగోలు జాతి ప్రపంచంలోనే పేరెన్నికగన్న పశువులు. ఇవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా అధికం. ఒక ఈత కాలంలో 2,500 లీటర్ల వరకు పాలిస్తాయి. ఇది గుర్తించిన బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో తదితర దేశాలు మన దేశం నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మన దేశంలో ఒకప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఒంగోలు జాతి పశువుల సంఖ్య.. క్రమేపీ తగ్గిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం వీటిని సంరక్షించాలని నిర్ణయించింది.
అంతరిక్ష రేడియేషన్‌పై నాసా కొత్త సాంకేతికత
భూమి నుంచి అంగారకుడికి చేరుకోవడంలో ముఖ్యమైన అడ్డంకి అంతరిక్ష రేడియేషన్‌ను అడ్డుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త సాంకేతికతను రూపొందిస్తోంది. దీంతో అంగారకుడిపైకి సురక్షితంగా, విజయవంతంగా చేరుకునే వీలు కలుగనుంది. భూమిపై రేడియేషన్ కన్నా అంతరిక్ష రేడియేషన్ చాలా ప్రమాదకరమైనదని నాసా పేర్కొంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) రక్షిత భూఅయస్కాంత క్షేత్రంలోనే ఉన్నప్పటికీ అక్కడి వ్యోమగాములు భూమిపై కన్నా పది రెట్ల ఎక్కువ రేడియేషన్‌కు గురవుతున్నారని చెప్పింది.
నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ కిల్తాన్ సముద్రపు అడుగు భాగం లో ఉన్న సబ్‌మెరైన్లనైనా గుర్తించి, మట్టుపెట్టే అధునాత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్.. భారత నౌకాదళంలో చేరింది. ఈ మేరకు అక్టోబర్ 16న కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డులో యుద్ధ నౌకను ప్రారంభించారు. దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
ప్రాజెక్టు-28 కింద నిర్మించ తలపెట్టిన నాలుగు యాంటీ సబ్‌మెరెన్ యుద్దనౌకల్లో ఐఎన్‌ఎస్ కిల్తాన్ మూడోది. ఐఎన్‌ఎస్ కమోర్తా, ఐఎన్‌ఎస్ కద్మత్ నౌకలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో నాలుగో యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరత్తి కూడా సిద్ధం కానుంది. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో నిరుపమాన సేవలందించిన యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను 1987లో డీ కమిషన్ చేశారు. మళ్లీ ఇదే పేరుతో నౌకను సిద్ధం చేశారు.
కిల్తాన్ ప్రత్యేకతలు
ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులుఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరు వరకు సుమారు 3.50 లక్షల చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 45 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. నల్లమలలో పులుల సంరక్షణ కోసం గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది గిరిజన యువకులను ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమైన ప్రాంతంలో కాపలాగా ఏర్పాటు చేశారు. వీరికి వైర్‌లెస్ వాకీ టాకీలు అందించి, పులులు సంచరించే ముఖ్య ప్రాంతాల వద్ద, చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వారం రోజుల క్రితం పులులను లెక్కించటంతో 45 లెక్క తేలినట్లు మార్కాపురం డీఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి అక్టోబర్ 14న వెల్లడించారు. చిరుత పులులు సుమారు 100 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
తొమ్మిదో గ్రహం ‘ప్లానెట్ 9’ ఉండొచ్చు: నాసాఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్ ఎర్త్’ఈ ప్లానెట్ 9 కావొచ్చని భావిస్తున్నారు. ప్లానెట్ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉందని వివరించారు.
ప్లానెట్ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాంటిన్ బాటీజిన్ తెలిపారు. ప్లానెట్ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ఎలిజబెత్ బెయిలీ పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్రహాన్ని ప్రయోగించిన యూఎస్ రహస్య గూఢచర్య ఉపగ్రహం ఎన్‌ఆర్‌ఓఎల్-52 ను అమెరికా అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం దేని కోసం పనిచేస్తుంది తదితర వివరాలను అమెరికా ప్రకటించలేదు. అయితే.. ఇది క్షిపణులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, అణు పేలుళ్ల గుర్తింపు, ఫోటోలతో నిఘా, రాఢార్ మేనేజింగ్ వంటి పనుల్ని నిర్వహిస్తుందని సమాచారం.
సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య-ఎల్ 1సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతిరావడంతో 2018-19లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది.
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య-ఎల్1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్‌స) అమర్చి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు-1 (ఎల్-1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది.
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్) వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడంలేదు. దీంతో సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య-ఎల్1 ద్వారా పరిశోధనలు చేయడానికి ఇస్రో నడుం బిగించింది. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్) అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే ఏడాదికల్లా దీనిని సిద్ధం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.
రక్తదానం ప్రోత్సాహానికి ఫేస్‌బుక్‌లో సౌకర్యం
రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్‌సైట్లో ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తారు.
గురుత్వ తరంగాలను మళ్లీ గుర్తించిన శాస్త్రవేత్తలు విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువ.
ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు.
భారతీయుల కీలక పాత్ర
గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో-ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్-తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.
చైనా సైన్యంలోకి జే - 20 యుద్ధ విమానం శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడిచేసే సామర్థ్యం కలిగిన స్టెల్త్ ఫైటర్ జే-20 అనే యుద్ధ విమానాన్ని చైనా సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీని సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇప్పటిదాకా పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. జే-20 చైనా దేశపు నాలుగోతరం యుద్ధవిమానం. 2011లో దీనిని తొలిసారిగా పరీక్షించారు. మరోవైపు ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఆసక్తి కనబరుస్తోంది.
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అమెరికా, రష్యా ఒప్పందం చంద్ర మండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకారానికి అమెరికా, రష్యా సెప్టెంబర్ 27న ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగారకుడిపైకి మానవులను పంపడం, అంతరిక్ష పరిశోధనలను మరింత లోతుగా ర్వహించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ ఒడంబడిక చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రాన్ని నాసా సారథ్యంలో ఏర్పాటు చేస్తారు.
ప్రపంచంలోనే తొలి ఉభయచర సముద్ర డ్రోన్ ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర విమాన డ్రోన్‌ను చైనా తయారుచేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడంతోపాటు దీవులకు సరుకులను చేరవేయగలదు. షాంఘైలోని యూవీఎన్ ఇంటలిజెన్స్ సిస్టమ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ వైమానిక వాహనాన్ని రూపొందించింది. యూ650 వాహనాల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఆ కంపెనీ సెప్టెంబర్ 25న ప్రకటించింది.
అంగారకుడిపై సౌర తుపాను
అంగారక గ్రహంపై సెప్టెంబర్ 11న బలమైన సౌర తుపాను సంభవించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తుపాను వల్ల గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపయ్యాయని తెలిపారు. తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన మావెన్ ఆర్బిటర్ గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కన్నా 25 రెట్లు ప్రకాశవంతమైందని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహం వాతావరణానికి, సౌర గాలులకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది.

- ఐఎన్‌ఎస్ కిల్తాన్.. ఐఎన్‌ఎస్ కమోర్తా కంటే శక్తిమంతమైంది. తొలిసారి పూర్తిస్థాయి కార్బన్ ఫైబర్ కాంపొజిట్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు.
- అన్ని ప్రధాన ఆయుధాల్ని, సెన్సార్లను సముద్రపు జలాల్లో ట్రయల్ రన్ నిర్వహించి.. షిప్ యార్డ్ ద్వారా నౌకాదళానికి అప్పగిస్తున్న మొదటి యుద్ధ నౌక.
- సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించడం వల్ల సముద్ర జలాల్లో వెళ్తున్నప్పుడు సబ్ మెరైన్‌లు సైతం దీని ధ్వనితరంగాలను కనిపెట్టడం దాదాపు అసాధ్యం.
- 109 మీటర్ల పొడవు, 3,500 టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ కిల్తాన్ 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిరాటంకంగా 3,450 నాటికల్ మైళ్లు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం.
- భారీ టార్పెడోలు, ఏఎస్‌డబ్ల్యూ రాకెట్లు, 76 మిమీ క్యారిబర్ మీడియం రేంజ్ తుపాకీలు, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కలిగిన 2 మల్టీ బ్యారెల్ తుపాకీలున్న సెన్సార్ సూట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
- మిస్సైల్ డెకోయ్ రాకెట్లు, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మేజర్ వ్యవస్థ, ఎయిర్ సర్వైవలెన్‌స రాడార్ వ్యవస్థతో పాటు ఏఎస్‌డబ్ల్యూ హెలికాప్టర్ కూడా ఇందులో ఉంటుంది.
ఏపీ పరిధిలోని నల్లమలలో 45 పెద్ద పులులుఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూరు వరకు సుమారు 3.50 లక్షల చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో 45 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. నల్లమలలో పులుల సంరక్షణ కోసం గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో 24 బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది గిరిజన యువకులను ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చి ముఖ్యమైన ప్రాంతంలో కాపలాగా ఏర్పాటు చేశారు. వీరికి వైర్‌లెస్ వాకీ టాకీలు అందించి, పులులు సంచరించే ముఖ్య ప్రాంతాల వద్ద, చెట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. వారం రోజుల క్రితం పులులను లెక్కించటంతో 45 లెక్క తేలినట్లు మార్కాపురం డీఎఫ్‌ఓ జయచంద్రారెడ్డి అక్టోబర్ 14న వెల్లడించారు. చిరుత పులులు సుమారు 100 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
తొమ్మిదో గ్రహం ‘ప్లానెట్ 9’ ఉండొచ్చు: నాసాఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్ ఎర్త్’ఈ ప్లానెట్ 9 కావొచ్చని భావిస్తున్నారు. ప్లానెట్ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉందని వివరించారు.
ప్లానెట్ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాంటిన్ బాటీజిన్ తెలిపారు. ప్లానెట్ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ఎలిజబెత్ బెయిలీ పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఓఎల్-52 ఉపగ్రహాన్ని ప్రయోగించిన యూఎస్ రహస్య గూఢచర్య ఉపగ్రహం ఎన్‌ఆర్‌ఓఎల్-52 ను అమెరికా అట్లాస్ - 5 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కానవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం దేని కోసం పనిచేస్తుంది తదితర వివరాలను అమెరికా ప్రకటించలేదు. అయితే.. ఇది క్షిపణులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు, అణు పేలుళ్ల గుర్తింపు, ఫోటోలతో నిఘా, రాఢార్ మేనేజింగ్ వంటి పనుల్ని నిర్వహిస్తుందని సమాచారం.
సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య-ఎల్ 1సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. ఇందుకోసం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతిరావడంతో 2018-19లో దీనిని ప్రయోగించే అవకాశం ఉంది.
బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రంలో ఆదిత్య-ఎల్1ను తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహంలో యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్ అనే ఆరు ఉపకరణాలను (పేలోడ్‌స) అమర్చి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు-1 (ఎల్-1)లోకి చేరుస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా సూర్యుడ్ని నిరంతరం పరిశీలించడానికి వీలవుతుంది.
సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్య గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ (అంటే 999726.85 డిగ్రీల సెల్సియస్) వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడంలేదు. దీంతో సౌర గోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై ఆదిత్య-ఎల్1 ద్వారా పరిశోధనలు చేయడానికి ఇస్రో నడుం బిగించింది. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్ఫియర్), వర్ణ మండలాలను (క్రోమోస్ఫియర్) అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే ఏడాదికల్లా దీనిని సిద్ధం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.
రక్తదానం ప్రోత్సాహానికి ఫేస్‌బుక్‌లో సౌకర్యం
రక్తదాతలతో ప్రజలు, బ్లడ్ బ్యాంక్‌లు, ఆస్పత్రులు సులువుగా అనుసంధానమయ్యేలా తన వెబ్‌సైట్లో ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని పొందుపరిచింది. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. రక్తం అసవరమున్న వారు ఒక ప్రత్యేక మెసేజ్‌లో బ్లడ్ గ్రూప్, ఆస్పత్రి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాల్ని పొందుపరిచి పోస్ట్ చేయాలి. వెంటనే ఫేస్‌బుక్ సమీపంలోని రక్తదాతల వివరాల్ని సేకరించి వారికి అందచేస్తుంది. అలాగే ఖాతాదారుల న్యూస్ ఫీడ్‌లో రక్తదాతగా నమోదు చేయించుకోవాలని కూడా మెసేజ్‌ను ప్రదర్శిస్తుంది. తొలుత ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో దీన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తారు.
గురుత్వ తరంగాలను మళ్లీ గుర్తించిన శాస్త్రవేత్తలు విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువ.
ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు.
భారతీయుల కీలక పాత్ర
గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో-ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్-తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి.
చైనా సైన్యంలోకి జే - 20 యుద్ధ విమానం శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడిచేసే సామర్థ్యం కలిగిన స్టెల్త్ ఫైటర్ జే-20 అనే యుద్ధ విమానాన్ని చైనా సైన్యంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీని సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇప్పటిదాకా పలు రకాల పరీక్షలు నిర్వహించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. జే-20 చైనా దేశపు నాలుగోతరం యుద్ధవిమానం. 2011లో దీనిని తొలిసారిగా పరీక్షించారు. మరోవైపు ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఆసక్తి కనబరుస్తోంది.
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అమెరికా, రష్యా ఒప్పందం చంద్ర మండల కక్ష్యలో తొలి అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో సహకారానికి అమెరికా, రష్యా సెప్టెంబర్ 27న ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగారకుడిపైకి మానవులను పంపడం, అంతరిక్ష పరిశోధనలను మరింత లోతుగా ర్వహించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ ఒడంబడిక చేసుకున్నారు. అంతరిక్ష కేంద్రాన్ని నాసా సారథ్యంలో ఏర్పాటు చేస్తారు.
ప్రపంచంలోనే తొలి ఉభయచర సముద్ర డ్రోన్ ప్రపంచంలోనే తొలి మానవ రహిత ఉభయచర విమాన డ్రోన్‌ను చైనా తయారుచేసింది. ఇది జలాంతర్గాములను గుర్తించడంతోపాటు దీవులకు సరుకులను చేరవేయగలదు. షాంఘైలోని యూవీఎన్ ఇంటలిజెన్స్ సిస్టమ్స్ అనే ప్రైవేట్ సంస్థ ఈ వైమానిక వాహనాన్ని రూపొందించింది. యూ650 వాహనాల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఆ కంపెనీ సెప్టెంబర్ 25న ప్రకటించింది.
అంగారకుడిపై సౌర తుపాను
అంగారక గ్రహంపై సెప్టెంబర్ 11న బలమైన సౌర తుపాను సంభవించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తుపాను వల్ల గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపయ్యాయని తెలిపారు. తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన మావెన్ ఆర్బిటర్ గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కన్నా 25 రెట్లు ప్రకాశవంతమైందని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహం వాతావరణానికి, సౌర గాలులకు మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది.
Wednesday, 11 October 2017
సెప్టెంబర్ 2017 సైన్స్ & టెక్నాలజీ
ఏరోసాల్ రూపొందించిన వారికి నాసా నజరానా
అతి తక్కువ ఖర్చుతో, తేలికై న ఏరోసాల్ సెన్సార్‌ను రూపొందించిన వారికి లక్ష డాలర్లను నజరానాగా అందజేస్తామని నాసా ప్రకటించింది. ఈ మేరకు రాబర్ట్ వుడ్ జాన్సన్‌స ఫౌండేషన్‌తో కలిసి ఎర్త అండ్ స్పేస్ ఎయిర్ ప్రైజ్ కాంపిటీషన్‌ను ప్రకటించింది.
గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన ఎయిర్ పార్టికల్స్‌ను గుర్తించి, అడ్డుకునే సెన్సార్లే.. ఏరోసాల్స్. వీటిని రూపొందించినట్లయితే భూమిపైన జీవించేవారితోపాటు అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వ్యోమగాములకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ సెన్సార్ల రూపకల్పనకు నాసా అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్‌లో దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ ప్రారంభంపర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్‌ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రారంభించింది. మనాలి - రోహ్‌తంగ్ మధ్య ఉన్న 51 కిలోమీటర్ల మార్గంలో ఈ బస్సు సేవలను ప్రారంభించింది. అలాగే.. త్వరలో కులు ప్రాంతంలో 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను ఈ తరహా బస్సులను అందుబాటులోకి తేనుంది.
ఇరాన్ ఖోరంషాహ్ర్ క్షిపణి పరీక్ష సక్సెస్అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ సెప్టెంబర్ 23న మధ్య శ్రేణి క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఖోరంషాహ్ర్ అనే ఈ క్షిపణిని ఇరాన్ సైనిక కవాతులో ప్రదర్శించింది. 2,000 కిలో మీటర్ల లోపు దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదనీ, బహుళ సంఖ్యలో వార్‌హెడ్లను మోసుకెళ్లగలదని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఇరాన్ శత్రుదేశాలైన ఇరాక్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. 2015లో ఇరాన్‌కు, ఇతర ప్రధాన దేశాలకు అణు పరీక్షల నిషేధంపై ఒప్పందం కుదిరింది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనా, రష్యా, యూరోపియన్ కూటమి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2025 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం అణ్వస్త్ర పరీక్షలు జరపకుండా ఇరాన్‌పై ఆంక్షలున్నాయి. క్షిపణి పరీక్షలను జరిపితే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తున్నా ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది.
పాక్ యాంటి - షిప్ క్షిపణి పరీక్ష విజయవంతంగగనతలం నుంచి సముద్ర ఉపరితలంపైకి ప్రయోగించే యాంటి-షిప్ క్షిపణిని పాకిస్తాన్ నౌకాదళం సెప్టెంబర్ 23న విజయవంతంగా పరీక్షించింది. ఇందుకోసం సీ కింగ్ హెలికాప్టర్లను పాక్ వినియోగించింది. పాకిస్తాన్ గతేడాది బ్రిటన్ నుంచి ఏడు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయగా అవి ఈ సంవత్సరం మేలో దాయాది దేశానికి అందుబాటులోకి వచ్చాయి. హెలికాప్టర్ నుంచి ప్రయోగించే ఈ క్షిపణితో సముద్ర జలాల్లో ఉన్న నౌకలు, ఇతర లక్ష్యాలను చేదించవచ్చు.
నాసా ఉపగ్రహంతో మలేరియా నివారణ చర్యలు
ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ప్రాణాంతక మలేరియా వ్యాధిని అరికట్టడానికి అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నూతన విధానాన్ని కనుగొన్నారు. నాసా అభివృద్ధి పరిచిన భూపర్యవేక్షక ఉపగ్రహాన్ని ఉపయోగించి ఏ ఏ ప్రాంతాల్లో మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందో తెలుసుకొని ముందుగానే నివారణ చర్యలు చేపట్టవచ్చని వెల్లడించారు.
మలేరియా ప్రభావిత ప్రాంతాల గణాంకాలను సేకరించి.. తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు దోమల మందు చల్లడం, దోమ తెరలు అందజేయడం, ప్రజల్లో అవగాహనా తేవడానికి ఈ ఉపగ్రహ విధానం ఉపయోగపడుతుంది.
మరోసారి జపాన్ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ప్యాంగ్‌యాంగ్ నుంచి సెప్టెంబర్ 15న ఈ క్షిపణిని ప్రయోగించింది. సుమారు 770 కిలోమీటర్ల ఎత్తులో.. 3,700 కిలోమీటర్లు ప్రయాణించి క్షిపణి సముద్రంలో పడిందని దక్షిణకొరియా రక్షణ శాఖ వెల్లడించింది. మూడు వారాల క్రితం జపాన్ భూభాగం మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. అలాగే ఈ నెలలో మరోసారి అణుపరీక్షలను కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కొత్తగా ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించింది.
శనిగ్రహంపై ముగిసిన స్పేస్‌క్రాఫ్ట్ కస్సీని ప్రస్థానం శనిగ్రహానికి(సాటర్న్) సంబంధించిన వివరాలను, విశేషాలను అద్భుత చిత్రాల రూపంలో అందించిన కస్సీని అంతరిక్ష నౌక 20 ఏళ్ల ప్రస్థానం సెప్టెంబర్ 15తో ముగిసింది. ఈ మేరకు కస్సీని ప్రస్థానానికి ముగింపునిచ్చేందుకు నాసా శాస్త్రవేత్తలు దానిని శనిగ్రహ వాతావరణంలోకి పంపించి, దానికదే మండిపోయేలా చేశారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనిగ్రహ సమాచార సేకరణ కోసం ఈ నౌకను 1997 అక్టోబర్‌లో ప్రయోగించింది. జూలై 2004 నుంచి 2017 సెప్టెంబర్ వరకు కస్సీని 4.5 లక్షల చిత్రాలను, 635 గిగాబైట్ల సమాచారాన్ని పంపించింది. ఆ వివరాలు ముఖ్యంగా శనిగ్రహానికి, ఆ గ్రహానికి చెందిన 62 ఉపగ్రహాలకు సంబంధించినవి.
‘అస్త్ర’ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే-బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజుల పాటు జరిగిన ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ సెప్టెంబర్ 15న ప్రకటించింది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు.
మూడో శతాబ్దంలోనే భారత్‌లో సున్నా గణితంలో ఎంతో కీలకమైన సున్నాను భారతీయులు మూడో శతాబ్దంలోనే విరివిగా వినియోగించారని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. అవిభక్త భారత్‌లోని బక్షాలి గ్రామంలో(ఇప్పటి పాకిస్తాన్‌లో ఉంది) 1881లో ఓ పొలంలో దొరికిన రాతప్రతిని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.
ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 9వ శతాబ్దానికి చెందిన ఓ దేవాలయం గోడలపై ఉన్న సున్నాయే ప్రాచీనమని భావించినట్లు పరిశోధనలో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మార్కస్ డు సౌటోయ్ వెల్లడించారు. గతంలో పరిశోధకులు బక్షాలి రాతప్రతిని 8 నుంచి 12వ శతాబ్ద కాలానికి చెందినదిగా భావించినట్లు పేర్కొన్నారు.
గూగుల్ ‘తేజ్’ సేవలు ప్రారంభం
డిజిటల్ చెల్లింపుల కోసం టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంస్థ రూపొందించిన ‘తేజ్’ యాప్‌ని సెప్టెంబర్ 18న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఇది కేవలం భారత మార్కెట్ కోసమే తీసుకొచ్చిన యాప్ అని, ఎలక్ట్రానిక్ చెల్లింపులను మరింత భద్రంగా సులభంగా నిర్వహించడమే తేజ్ లక్ష్యమని గూగుల్ పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యాప్‌లోకి బ్యాలన్స్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా.. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌తోపాటు తెలుగు సహా ఏడు భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
తేజ్ సేవలకు గాను గూగుల్ యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే.. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్న 50 బ్యాంకుల కస్టమర్లు తేజ్ సేవలు వినియోగించుకోవచ్చు.
డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన మహీంద్రా ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎంఅండ్ఎం) దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. కంపెనీ దీన్ని వచ్చే ఏడాది దశల వారీగా అందుబాటులోకి తీసుకురానుంది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇక 20 హెచ్‌పీ- 100 హెచ్‌పీ శ్రేణిలోని ట్రాక్టర్లలోనూ డ్రైవర్‌లెస్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
నాగ్ క్షిపణి పరీక్ష విజయవంతం దేశీయంగా తయారైన మూడో తరం ఏటీజీఎం(యాంటీ-ట్యాంక్ గెడైడ్ మిసైల్) నాగ్ పరీక్ష విజయవంతమైంది. ఈ మేరకు సెప్టెంబర్ 8న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నాగ్ క్షిపణిని రాజస్తాన్ ఎడారిలో రెండు సార్లు పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి.
ఈ ఏడాది జూన్‌లోనూ ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు.
అతి భారీ కృష్ణ బిలం గుర్తింపు
మన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణ బిలాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సూర్యుని కన్నా దాదాపు లక్ష రెట్లు ఎక్కువ సైజులో ఉంటుందని, పాల పుంత కేంద్ర భాగంలోని విష వాయువుల సమూహం వెనక (కేంద్ర భాగానికి 200 కాంతి సంవత్సరాల దూరంలో 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర) ఉందని తెలిపారు. మన గెలాక్సీలోని సాజిటేరియస్-ఏ అనే కృష్ట బిలమే ఇప్పటివరకు అత్యంత పెద్దది. ప్రస్తుతం కనుగొన్న కృష్ణ బిలం రెండో అతి పెద్దదై ఉండొచ్చని భావిస్తున్నారు. కృష్ణ బిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయని పేర్కొన్నారు.
పీఎస్‌ఎల్వీ-సీ39 ప్రయోగం విఫలంభారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆగస్టు 31న చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ- సీ 39 రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. భారత్‌కు సొంత దిక్సూచి వ్యవస్థను సమకూర్చడంలో భాగంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ మోసుకెళ్లిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయింది. ఉష్ణకవచం (హీట్ షీల్డ్) రాకెట్ నుంచి వేరుపడకపోవడంతో దానిలో ఉన్న ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లలేదనీ, నాలుగో దశలోనే ఇరుక్కుపోయిందని ఇస్రో వెల్లడించింది.
కాగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు సంక్షిప్త రూపమైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం వైఫల్యం చెందడం గత 24 ఏళ్లలో ఇదే తొలిసారి. పీఎస్‌ఎల్‌వీ చరిత్రలోనే రెండోసారి. 1993 సెప్టెంబరు 20న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-డీ1 అనే రాకెట్ ఐఆర్‌ఎస్-1ఈ ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లడంలో తొలిసారి విఫలమైంది.
ఆరోసారి అణు పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు ఆరో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని, ఈసారి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఉత్తరకొరియా సెప్టెంబర్ 3న ప్రకటించింది. ఈ అణు పరీక్ష వాస్తవిక సామర్థ్యం ఎంత అనేదానిపై స్పష్టత రాలేదు. దక్షిణకొరియా వాతావరణ ఏజెన్సీ మాత్రం ప్రస్తుత ప్రయోగం వల్ల వచ్చిన ప్రకంపనలు గత ప్రయోగాల కంటే ఐదారురెట్లు ఎక్కువని వెల్లడించింది. దీని వల్ల చైనా, రష్యాలో పలు భవనాలు కంపించినట్టు పేర్కొంది.
అతి భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలుమన పాలపుంత కేంద్ర భాగంలో అతి భారీ కృష్ణబిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి కంటే దాదాపు లక్ష రెట్లు ఎక్కువ పరిమాణాన్ని ఇది కలిగి ఉంటుందని తెలిపారు. ఇది మన పాలపుంత కేంద్ర భాగంలో ఉన్న విష వాయువుల సమూహం వెనుక దాక్కుని ఉందన్నారు. మన గెలాక్సీలోని ‘సాజిటేరియస్ ఏ’ అనే కృష్ణ బిలం ఇప్పటివరకు అత్యంత పెద్దది. అయితే, ప్రస్తుతం కనుగొన్న ఈ కృష్ణబిలం రెండో అతిపెద్దది అయి్య ఉండవచ్చని భావిస్తున్నారు. మన పాలపుంత కేంద్ర భాగానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కృష్ణబిలం ఉంది. ఇది దాదాపు 150 ట్రిలియన్ కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణబిలం దగ్గర నుంచి రేడియో తరంగాలు ఉద్భవిస్తున్నాయి.

Wednesday, 23 August 2017
ఆగస్టు 2017 సైన్స్ & టెక్నాలజీ
హ్యాష్‌ట్యాగ్‌కు పదేళ్లు పూర్తి
సామాజిక మాధ్యమాల్లో కీలకంగా వాడే హ్యాష్‌ట్యాగ్ (#)కు ఆగస్టు 23తో పదేళ్లు పూర్తయ్యాయి. అమెరికాకు చెందిన క్రిస్ మెస్సినా అనే సామాజిక మాధ్యమ నిపుణుడు హ్యాష్‌ట్యాగ్ విధానాన్ని రూపొందించి, తొలిసారిగా 2007 ఆగస్టు 23న ఓ ట్వీట్‌లో ‘#barcamp’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వాడారు. అప్పటి నుంచి ఇది ప్రచారంలోకి వచ్చింది.
ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని నేవీకి అప్పగించిన జైట్లీ హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్‌లో ఆగస్టు 28న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ.. సామ్ క్షిపణిని నావికాదళానికి అప్పగించారు. అలాగే.. బార్‌కోడ్‌తో రూపొందించిన బీఎంపీ-2 వాహనాలను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. అధునాతన ఎల్‌ఆర్ సామ్ క్షిపణిని బీడీఎల్, మిథాని సంయుక్తంగా రూపొందించాయి. పటాన్‌చెరులోని బీడీఎల్ పరిశ్రమలో అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను జైట్లీ ప్రారంభించారు.
జపాన్ మీదుగా ఉత్తర కొరియా క్షిపణి
వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న ఉత్తర కొరియా ఆగస్టు 29న జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని సునన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి జపాన్ మీదుగా ప్రయాణించి ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో పడింది. 2,700 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షిపణి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై జపాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా క్షిపణి ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున.. ఉత్తర కొరియాపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అమెరికా, జపాన్‌లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐక్యరాజ్యసమితిని కోరాయి.
సైన్యానికి బోయింగ్ అపాచీ హెలికాప్టర్లుభారత సైన్యం కోసం అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఆగస్టు 17న సమావేశమైన రక్షణ సామాగ్రి సేకరణ మండలి (డీఏసీ) రూ.4,168 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. మరో మూడేళ్లలో వీటిని భారత సైన్యానికి అప్పగించనున్నారు.
ఒప్పందంలో భాగంగా బోయింగ్ సంస్థ దాడికి ఉపయోగించే ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు ఆయుధ వ్యవస్థ, మందుగుండు, విడిభాగాలు, శిక్షణ అందించనుంది. 2015, సెప్టెంబర్‌లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఆర్డర్ ఇచ్చిన 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లకు అదనంగా ఇవి భారత అమ్ములపొదిలో చేరనున్నాయి.
కేరళలో రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు రెండు కొత్తరకం వానపాము జాతులను గుర్తించారు. వీటికి ద్రవిడ డైవర్టిక్యులట, ద్రవిడ తోమసిగా నామకరణం చేశారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ రెండు జాతుల మధ్య కూడా చాలా తేడాలున్నాయని కేరళలలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్కూలిని యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ద్రవిడ డైవర్టిక్యులేట ఒంటిపై పదుల సంఖ్యలో ఖండికలుండగా కీలక అవయవాలన్నీ శరీరానికి ముందు భాగంలో ఉన్నాయి. మున్నార్ ప్రాంతంలోని షోలా గడ్డి భూములు, ఎరావికుళం నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇక ద్రవిడ తోమసిగా నామకరణం చేసిన మరో జాతిని కొజిప్పారా జలపాతం సమీపంలోని భూముల్లో గుర్తించారు. ఈ రెండు వానపాములు కూడా మోనిలిగాస్ట్రిడే జాతికి చెందిన జీవులు.
ఇస్రో, నాసా ఆధ్వర్యంలో నిసార్ ప్రాజెక్టు భూమిపై వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు, నేలల పరిశీలన కోసం ఇస్రో, నాసా సంస్థలు నిసార్ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో నిఘా సెన్సార్లను ఏర్పాటు చేయనున్నాయని.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్ తపన్ మిశ్రా ఆగస్టు 20న వెల్లడించారు. అత్యయిక పరిస్థితులలో వీలైనంత వేగంగా స్పందించి సహాయ సహకారాలు అందించేందుకు ఈ సెన్సార్లు ఉపయోగపడతాయి.
అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. పశ్చిమ తీరంలో ఒరెగాన్‌లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ అద్భుతం 14 రాష్ట్రాల గుండా సాగింది. గ్రహణంతో అమెరికాలో 14 రాష్ట్రాల మీదుగా 70.కి.మీ వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. ఒరెగాన్ రాష్ట్రంలో మొదలై తూర్పు తీరమైన దక్షిణ కరోలినా రాష్ట్రంలో ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మాత్రం 90 నిమిషాలు కొనసాగింది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. దాదాపు 99 ఏళ్ల తర్వాత అమెరికాలో ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
రోదసీలోకి చేరిన తొలి సూపర్ కంప్యూటర్మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ (స్పేస్ బర్నో కంప్యూటర్) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్‌కెనవారాల్‌లో నిర్వహించారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్ ఈ సూపర్ కంప్యూటర్‌ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్ కంప్యూటర్‌ను హ్యూలెట్ ఎయాకార్డ్ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్ ఎక్స్‌కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు.
నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్‌సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి.
తెలుగులోనూ గూగుల్ సెర్చ్టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా తన వాయిస్ సెర్చ్ ఫీచర్‌కు తెలుగు భాషను యాడ్ చేసింది. దీంతో ఇక తెలుగులో చెబుతూనే గూగుల్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. తెలుగుతోపాటు ఇకనుంచి తమిళ్, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ గూగుల్ సెర్చ్ చేయొచ్చు. ఇదివరకు కేవలం ఆంగ్లం, హిందీలో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ అందుబాటులో ఉండేది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుగులో చెబుతూ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్‌సలో ఉన్న ‘సెర్చ్ లాంగ్వేజ్’ ఆప్షన్‌లో ఆంగ్లం బదులుగా తెలుగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
తీర ప్రాంత అప్రమత్తతకు "సాగర్ వాణి" ప్రారంభం సముద్రంలోని వాతావరణ పరిస్థితులపై మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 29న సాగర్‌వాణి అనే వ్యవస్థను ప్రారంభించింది. The Integrated Information Dissemination System (IDS) వ్యవస్థతో దేశంలో తొలిసారి ప్రారంభించిన ఈ విధానం ద్వారా మత్య్స వృత్తిపై ఆధారపడిన 9.27 లక్షల మందికి సముద్ర రక్షణకు సంబంధించిన సమాచారం పంపుతారు. రేడియా, టీవీ, వాయిస్ కాలింగ్, సంక్షిప్త సందేశాలు, సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఆప్స్ ద్వారా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని చేరవేస్తారు. Indian National Centre for Ocean Information Services (INCOIS) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

Subscribe to:
Comments (Atom)